Mid-Day Meal Scheme | మధ్యాహ్న భోజనంపై గరికపాటి వ్యాఖ్యలు.. ఉపాధ్యాయుడు తిరుపతిరావు స్పందన ఇదే..!
Mid-Day Meal Scheme | మాకు చిన్నప్పుడు అన్నం తో కూడిన మధ్యాహ్న భోజనం ఉండేది కాదు! కోడిగుడ్డు, కూరలు లేవు! అయితే గోధుమలతో చేసిన ఉక్మా పెట్టే వాళ్ళు! అది ఎంతో రుచికరంగా ఉండేది! కాలక్రమంలో ఆ స్కీంను ఎత్తేసిండ్రు! 1995 లో జాతీయ పోషకాహార సంస్థ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని సూచించింది!
Mid-Day Meal Scheme | మాకు చిన్నప్పుడు అన్నం తో కూడిన మధ్యాహ్న భోజనం ఉండేది కాదు! కోడిగుడ్డు, కూరలు లేవు! అయితే గోధుమలతో చేసిన ఉక్మా పెట్టే వాళ్ళు! అది ఎంతో రుచికరంగా ఉండేది! కాలక్రమంలో ఆ స్కీంను ఎత్తేసిండ్రు! 1995 లో జాతీయ పోషకాహార సంస్థ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని సూచించింది! విద్యార్థులు తరగతి గదిలో ఆకలిబాధలు పడకుండా చదువుకోవాలని అభిప్రాయపడింది! అయితే చాలా రాష్ట్రాలు అమలుకు ముందుకు రాలేదు! భోజనాన్ని బడి లో వండిపెట్టలేమని కొన్ని రాష్ట్రాలు కొంత కాలం బియ్యాన్ని పంపిణీ చేశాయి! అట్ల మన రాష్ట్రంలో కూడా మధ్యాహ్న భోజనం బదులు బడిలో బియ్యం పంపిణీ చేసేవారు! 2001, నవంబర్ 28న సుప్రీంకోర్టు దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్పునిచ్చింది! దాంతో ప్రభుత్వ బడుల్లో చదివే విధ్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు కాబడుతున్నది! సుప్రీమ్ కోర్టు తీర్పు వచ్చాకే పథకం అమలుకు నోచుకున్నది!
నిజానికి మధ్యాహ్నభోజనంలో నాణ్యత లోపిస్తున్నది అని, కోడి గుడ్డును క్రమం తప్పకుండా పెట్టాలని, మెనూను పాటించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తం అవుతున్నది! చాలా మంది పిల్లలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే బడికి వచ్చి ప్రార్థన సమయంలో చెక్కర వచ్చి పడిపోతున్నారు! మధ్యాహ్న భోజనంతో పాటు, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉచిత అల్పాహారం (Breakfast) అందించే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది! అందుకు బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయించారు! ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని, ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది! దీని కోసం ప్రత్యేకంగా ₹100 కోట్లు కేటాయించారు! పాఠశాలల్లో భోజనం వండే వంటశాలలను (Kitchen sheds) ఆధునీకరించడానికి మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి బడ్జెట్‌లో ₹100 కోట్లు కేటాయించారు! బడిలో మధ్యాహ్న భోజనం వద్దని, పిల్లలకు పుస్తకాలు, బట్టలు కూడా ఇవ్వవద్దు అని గరికపాటి వారు అన్నట్లు వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇదంతా..!!
-తానిపర్తి తిరుపతి రావు , ఉపాధ్యాయుడు
SA(Maths) , ZPHS, పూసాల, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Save the Tigers Season 3 | నవ్వులు పంచేందుకు మళ్లీ వచ్చేస్తున్న 'టైగర్స్'.. 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' క్రేజీ అప్డేట్ ఇది
- ●Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!
- ●Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
- ●US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
- ●Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే
- ●HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం

Save the Tigers Season 3 | నవ్వులు పంచేందుకు మళ్లీ వచ్చేస్తున్న 'టైగర్స్'.. 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' క్రేజీ అప్డేట్ ఇది

Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!

Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!

US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్






