Talasani Srinivas Yadav | 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొందపెడతారు: తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అబద్దాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అబద్దాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, రాబోయే రోజుల్లో బీసీలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడుతారుని మండిపడ్డారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే మొదటి ఏడాది బీసీ సబ్ ప్లాన్‌కు రూ.800 కోట్లు ఖర్చు చేస్తామన్నారని తెలిపారు. రెండో ఏడాది రూ.11 వేల కోట్లు నిధులు కేటాయించి.. కేవలం రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారని.. ఇది దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
బీసీ విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని చెప్పారు. బడుగుల లింగయ్య యాదవ్‌ను రాజ్యసభకు పంపించారని తెలిపారు. చాలా మంది బీసీ నాయకులకు అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని, కుల వృత్తులను ప్రోత్సహించారన్నారు. 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేశారని కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను బీసీలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ బొంద పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
https://x.com/BRSparty/status/2037019793547821073
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



