Mahesh Kumar Goud | రెండేళ్ల పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపుకు: మహేశ్‌కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌజ్‌కు పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు.
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడి
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్‌హౌజ్‌కు కేసీఆర్ పలాయనం చిత్తగించారని ధ్వజం
Mahesh Kumar Goud | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విజన్ ఉన్న లీడర్ అని కొనియాడారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో అన్ని వర్గాల వారు వివక్షకు గురయ్యారని ఆరోపించారు. కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌజ్‌కు పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో దావోస్ పర్యటన తో రాష్ట్రానికి రూ. 1.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..
నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న మొదటి అయిదు జిల్లాల్లో నిజామాబాద్ ఒకటని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ వలన కొంత మేర నష్టం కలిగిందని అంగీకరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికలతో పాత, కొత్త నేతలను సమన్వయపరిచి మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని అన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి బీఫామ్ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమం చూసి మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు జారీ చేశామని పీసీసీ చీఫ్ చెప్పారు. న భూతో న భవిష్యత్ అనేలా అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. గతంలో (బీఆర్ఎస్ హయంలో) నిజామాబాద్ కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ జరిగేదని గుర్తు చేశారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, స్పోర్ట్స్ కి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. జిల్లాలో 80 శాతం మందికి ఉచిత విద్యుత్ పథకం అందుతుందని చెప్పారు. కులం, మతం పక్కనబెట్టి పేదవారి జీవిత స్థితిగతులు మారాలని అభిప్రాయపడ్డారు.
బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి..
దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చర్యల వలన ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటి అయిపోయిందని మండిపడ్డారు. 12 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం ఒరగబెట్టిందో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగే వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



