Talasani vs Revanth | అసెంబ్లీని అసెంబ్లీలా నడిపించాలని.. గాంధీ భవన్‌లా నడిపించవద్దని.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హితువు పలికారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా నడిపిస్తే తాము సభలోకి రామని.. అసెంబ్లీని అసెంబ్లీలా నడిపిస్తేనే తాము సభలోకి వస్తామని స్పష్టం చేశారు. మా ఇష్టం ఉన్నట్లు చేసుకుంటామని వ్యవహరిస్తున్నారు. చరిత్రలో చాలా ప్రభుత్వాలను చూశాం. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సలహాలు, సూచనలు ఇవ్వమని అంటారు. మరోవైపు బూతులు తిడతారు. మూసీ పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేశారు.