Talasani Srinivas Yadav | సవాల్ విసిరి పిరికిపందల్లా పారిపోయారు.. కాంగ్రెస్ మంత్రులపై తలసాని విమర్శలు
Talasani Srinivas Yadav | సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు పిరికిపందల్లా పారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావుతో పాటు అరెస్టయిన ఇతర పార్టీ నేతలను ఆయన పరామర్శించారు.
Talasani Srinivas Yadav | సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు పిరికిపందల్లా పారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావుతో పాటు అరెస్టయిన ఇతర పార్టీ నేతలను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయితే ఆ అప్పుతో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేదని తలసాని ఆరోపించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించారన్నారు. అధికార పార్టీ నాయకులు బూతులు మాట్లాడితే కేసులు నమోదు కావడం లేదని, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న తమపై మాత్రం కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు వస్తుంటాయని, పోతుంటాయని, కానీ వ్యవస్థలు శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తలసాని అన్నారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు.
మంత్రులే పిలిచినందుకే హరీశ్‌రావు గన్‌పార్క్ వద్దకు బయలుదేరారని, అలాంటి పరిస్థితిలో ఆయనను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులకు నిజంగా దమ్ముంటే కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అగ్రికల్చర్ శాఖలో పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణిని లూప్‌లైన్‌కు బదిలీ చేశారని ఆరోపించిన తలసాని, ఇది ప్రభుత్వం అనుకోవాలా.. సర్కస్ అనుకోవాలా అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం సర్కస్ కంపెనీలా వ్యవహరిస్తూ డ్రామాలు ఆడుతోందని, రాష్ట్రంలో నడుస్తోంది ప్రభుత్వం కాదని, సర్కస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
జులై 2, 2026

Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు
జులై 2, 2026

Amarnath | మంచు బిందువులే శివలింగంగా..! అమర్నాథ్ మంచు శివలింగం వెనుక రహస్యమిదే..!
జులై 2, 2026
తాజావార్తలు
- ●Vishwambhara | షూటింగ్ పూర్తయిన ఏడాది తర్వాత థియేటర్లలోకి చిరంజీవి మూవీ - పదేళ్ల తర్వాత త్రిష కమ్‌బ్యాక్
- ●Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
- ●SBI Funds IPO | పెట్టుబడిదారులకు భారీ శుభవార్త.. ఎస్బీఐ ఫండ్స్ భారీ ఐపీఓ వస్తోంది..
- ●Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు
- ●Supreme Court | న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీం ఆందోళన.. నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని స్పష్టీకరణ
- ●HUAWEI Band 11 Series | రూ.3,999కే హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్లు.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్..

Vishwambhara | షూటింగ్ పూర్తయిన ఏడాది తర్వాత థియేటర్లలోకి చిరంజీవి మూవీ - పదేళ్ల తర్వాత త్రిష కమ్‌బ్యాక్

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా

SBI Funds IPO | పెట్టుబడిదారులకు భారీ శుభవార్త.. ఎస్బీఐ ఫండ్స్ భారీ ఐపీఓ వస్తోంది..

Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు



