త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ‌మే లేదు : టీ పీసీసీ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు

Mahesh Kumar Goud | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయం లేదు అని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మ‌హేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్ చేశారు.

S

Telangana | Published On Feb 18, 2026, 4.27 pm IST

Mahesh Kumar Goud | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ‌మే లేదు : టీ పీసీసీ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయం లేదు అని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మ‌హేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్ చేశారు.

19న ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే ఏఐసీసీ స‌మావేశానికి హాజ‌రవుతాం. పార్టీ నిర్మాణం, సంక్షేమంపై చ‌ర్చిస్తాం. ఇప్ప‌టికే 11 రాష్ట్రాల‌పై స‌మీక్ష అయిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేష‌న్లు క‌ల్పించాం. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. 67 శాతం బీసీ వార్డు మెంబర్లు గెలిచారు. 87.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదు. 94 మున్సిపాలిటీలు గెలిచామంటే అభివృద్ది, సంక్షేమం పట్ల ప్రజలు సానుకూలతకు నిదర్శనం. నిజామాబాద్‌లో 5 సీట్లలో ఎంఐఎం అభ్యర్థుల మీద గెలిచాం. మేయర్ వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్లు ఆ దిశగా ఆలోచించారని మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement