త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T PCC | గ‌వ‌ర్న‌ర్ ఆమోదం శుభ‌ప‌రిణామం.. ఆ ఎమ్మెల్సీల అవ‌స‌రం ఎంతో ఉంది..

T PCC | కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండ‌రాం పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రానికి ఉద్యమ అనుభవం, సామాజిక అవగాహన, ప్రజా సమస్యలపై స్పష్టత ఉన్న నాయకుల అవసరం ఎంతో ఉందన్నారు.

S

Telangana | Published On Apr 25, 2026, 4.26 pm IST

T PCC | గ‌వ‌ర్న‌ర్ ఆమోదం శుభ‌ప‌రిణామం.. ఆ ఎమ్మెల్సీల అవ‌స‌రం ఎంతో ఉంది..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండ‌రాం పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రానికి ఉద్యమ అనుభవం, సామాజిక అవగాహన, ప్రజా సమస్యలపై స్పష్టత ఉన్న నాయకుల అవసరం ఎంతో ఉందన్నారు.

సమాజానికి సేవ చేసిన వ్యక్తులకు శాసన మండలిలో స్థానం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రజా జీవితం, క్రీడా రంగం, సామాజిక ఉద్యమాల్లో విశిష్ట సేవలు అందించిన అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ అవకాశం రావడం సముచిత నిర్ణయమని తెలిపారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని కొనియాడారు. ఉద్యమ దశలో ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లిన నాయకుల్లో కోదండరాం ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తికి శాసన మండలిలో అవకాశం కల్పించడం రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో వివిధ రంగాల అనుభవం ఉన్న వ్యక్తులు శాసనసభలు, శాసన మండలిలో ఉండటం ద్వారా పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రానికి ఉద్యమ అనుభవం, సామాజిక అవగాహన, ప్రజా సమస్యలపై స్పష్టత ఉన్న నాయకుల అవసరం ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని, సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తోందని చెప్పారు. గవర్నర్ ఆమోదంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనమని పేర్కొన్నారు.

అజారుద్దీన్, కోదండరామ్‌లకు ఎమ్మెల్సీ పదవులు రావడం ద్వారా శాసన మండలి చర్చలు మరింత ప్రజా ప్రయోజనకరంగా మారుతాయని, రాష్ట్ర అభివృద్ధికి వారి అనుభవం ఉపయోగపడుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement