Mahesh Kumar Goud | మహిళా కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం
Mahesh Kumar Goud | తెలంగాణలో మహిళా కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ సర్కార్ మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు.
గాంధీ భవన్లో బతుకమ్మ వేడుకలు
పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మంత్రి సీతక్క
Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో మహిళా కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ సర్కార్ మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో తన సతీమణితో కలిసి మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి సీతక్క, పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళల పేరుతో ఎక్కువ పథకాలు కొనసాగుతున్నాయి. ఆడపడుచులందరికీ బతుకమ్మ దీవెనలు ఇవ్వాలి. మహిళలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం సుఖసంతోషాలతో మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు.
పూర్వీకులు ఇచ్చిన పురాతన పండుగ బతుకమ్మ : మంత్రి సీతక్క

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయని, పూర్వీకులు ఇచ్చిన పురాతన పండుగ ఇది మంత్రి సీతక్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సహకారంతో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. బతుకమ్మ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. అడుక్కునే పరిస్థితి నుండి శాసించే స్థాయి వరకు మహిళలు ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. ఆస్తులు, పదవులు పోతాయి, వస్తాయి.. కానీ సంస్కృతి సంప్రదాయాలు తిరిగి రావు. మహిళలకు ఇచ్చిన గొప్ప ఆస్తులు ఆటపాట, సంస్కృతి, సంప్రదాయాలు. మహిళలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నాం అని మంత్రి సీతక్క తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mrunal Thakur | మృణాల్ కొత్త సినిమాలకు నో చెబుతోందా..? అసలు కారణం అదేనా..?
- ●Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం
- ●EPFO | ఈపీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చంటే?
- ●Kriti Shetty | బాలీవుడ్లోకి కృతిశెట్టి.. ప్రేమకథతో కొత్త ప్రయాణం!
- ●Harvard Community India | హార్వర్డ్ యూనివర్సిటీ పేరుతో రాజకీయ ప్రచారమా? భారత రాజ్యాంగ సంస్థలపై దాడి జరుగుతోంది
- ●Reliance Industries | జియో ఐపీఓపై భారీ అంచనాలు.. అయినా రిలయన్స్ షేర్ల పతనం ఎందుకు?

Mrunal Thakur | మృణాల్ కొత్త సినిమాలకు నో చెబుతోందా..? అసలు కారణం అదేనా..?

Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం

EPFO | ఈపీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చంటే?

Kriti Shetty | బాలీవుడ్లోకి కృతిశెట్టి.. ప్రేమకథతో కొత్త ప్రయాణం!





