Kriti Shetty | బాలీవుడ్లోకి కృతిశెట్టి.. ప్రేమకథతో కొత్త ప్రయాణం!
Kriti Shetty | ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం. అలాంటి అరుదైన గుర్తింపునే ‘ఉప్పెన’తో సొంతం చేసుకున్నది కృతిశెట్టి. తొలి చిత్రంతోనే యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది.
Entertainment | Published On Oct 14, 2026, 5.01 pm IST
Kriti Shetty | ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం. అలాంటి అరుదైన గుర్తింపునే ‘ఉప్పెన’తో సొంతం చేసుకున్నది కృతిశెట్టి. తొలి చిత్రంతోనే యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. అయితే, కెరీర్ ఆరంభంలో దక్కిన విజయాలు ఆ తర్వాత కొనసాగకపోవడంతో ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఓ అందమైన ప్రేమకథతో హిందీ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది.
శ్రీవారి ఆశీస్సులతో కొత్త అడుగు
కృతిశెట్టి బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన ప్రాజెక్టును చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాతో విధి ఘోడ్గావోంకర్ దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టితో 17 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్గా, కాస్టింగ్ డైరెక్టర్గా, డైలాగ్ రైటర్గా పనిచేసిన ఆమె.. ఇప్పుడు మెగాఫోన్ పట్టనున్నారు. అభిషేక్ ఎస్ వ్యాస్కు చెందిన ఏవీఎస్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరో ఎవరు? అన్నది ఇంకా వెల్లడించలేదు.
‘ఉప్పెన’తో మొదలైన క్రేజ్..
కృతిశెట్టి పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘ఉప్పెన’ సినిమానే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంతో ఆమె హీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన నటన, అందంతో యువతను ఆకట్టుకున్నారు. ఆ సినిమా సాధించిన విజయంతో కృతిశెట్టికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘బంగార్రాజు’ విజయం ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆరంభంలో వచ్చిన విజయాల జోరు ఆ తర్వాత కొనసాగలేదు. కథల ఎంపిక, సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆమె కెరీర్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది.
రెండు సినిమాల్లో..
తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ.. కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లే భారీ విజయం మాత్రం దక్కలేదు. మరి బాలీవుడ్లోనైనా రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో జీని మూవీతో పాటు తెలుగులో జనవరి 12 విడుదల మూవీలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. అలాగే, కీర్తి సురేశ్ సైతం మరో హీరోయిన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harvard Community India | హార్వర్డ్ యూనివర్సిటీ పేరుతో రాజకీయ ప్రచారమా? భారత రాజ్యాంగ సంస్థలపై దాడి జరుగుతోంది
- ●Reliance Industries | జియో ఐపీఓపై భారీ అంచనాలు.. అయినా రిలయన్స్ షేర్ల పతనం ఎందుకు?
- ●Niranjan Reddy | బీఆర్ఎస్ హెచ్చరించినందుకే.. పాలమూరు ఎత్తిపోతల మోటార్లు ప్రారంభం
- ●MP Chamala Kiram Kumar Reddy | అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు తేలితే అధికారులకు రాసిస్తా
- ●Jailer 2 | ‘జైలర్ 2’పై తగ్గిన బజ్.. బాక్సాఫీస్ వద్ద రజనీ మ్యాజిక్ పనిచేసేనా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. సెన్సెక్స్ 252 పాయింట్లు డౌన్..

Harvard Community India | హార్వర్డ్ యూనివర్సిటీ పేరుతో రాజకీయ ప్రచారమా? భారత రాజ్యాంగ సంస్థలపై దాడి జరుగుతోంది

Reliance Industries | జియో ఐపీఓపై భారీ అంచనాలు.. అయినా రిలయన్స్ షేర్ల పతనం ఎందుకు?

Niranjan Reddy | బీఆర్ఎస్ హెచ్చరించినందుకే.. పాలమూరు ఎత్తిపోతల మోటార్లు ప్రారంభం

MP Chamala Kiram Kumar Reddy | అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు తేలితే అధికారులకు రాసిస్తా





