త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Party | జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధి.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశం

Congress Party | రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల హడావిడి కొన‌సాగుతోంది. ఆయా పార్టీల నేత‌లు గెలుపే ల‌క్ష్యంగా క‌స‌ర‌త్తులు చేస్తూ.. పార్టీ కార్యాల‌యాల్లో స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

S

Telangana | Published On Jan 31, 2026, 7.35 pm IST

Congress Party | జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధి.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశం
Advertisement

Congress Party | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల హడావిడి కొన‌సాగుతోంది. ఆయా పార్టీల నేత‌లు గెలుపే ల‌క్ష్యంగా క‌స‌ర‌త్తులు చేస్తూ.. పార్టీ కార్యాల‌యాల్లో స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గాంధీ భ‌వ‌న్‌లో పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, అజారుద్దీన్, సంగారెడ్డి డీసీసీ అధ్య‌క్షురాలు నిర్మ‌లా జ‌గ్గారెడ్డి, జ‌హీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ రావు, సీఎం స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, బి ఫార్మ్స్‌ పంపిణీపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రుల చేతుల మీదుగా బి ఫారాలు అందజేయాలని నిర్ణయించారు. గెలిచే అభ్యర్థులకే బి ఫార్మ్ అందజేయాలని, ఎలాంటి పైరవీలకు ప్రభావితం కావొద్ద‌ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిందేనని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement