Mahesh Kumar Goud | కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్.. హరీశ్‌కి మరదల్ స్ట్రోక్ : మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పట్ల టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్.. బావ హరీశ్‌రావుకి మరదల్ స్ట్రోక్ తగిలి మతిభ్రమించిందని నోరు పారేసుకున్నారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పట్ల టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్.. బావ హరీశ్‌రావుకి మరదల్ స్ట్రోక్ తగిలి మతిభ్రమించిందని నోరు పారేసుకున్నారు.
గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే కవిత ప్రశ్నలకు అన్న కేటీఆర్, బావ హరీశ్‌రావు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి, పార్టీ పేరు మార్పుపై కవిత ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు లేవు అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం పైగా స్థానాలను గెలుచుకున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 25 వేలకు పైగా మెజార్టీతో గెలిచామని తెలిపారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మున్సిపల్స్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికలతో మున్సిపల్ ఎన్నికలో రంగంలోకి దిగుతామన్నారు. సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళతామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో విద్య, వైద్యం, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా వార్త కథనాలు ఖండిస్తున్నానని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. వాస్తవానికి దూరంగా వార్త కథనాలు శ్రేయస్కరం కాదన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. నిరుద్యోగుల ఉసురు తగిలి బిఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. సినిమా టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. హైదరాబాద్ భూములు అమ్మిన ఘనత బీఆర్ఎస్ పార్టీది.. అసలు రియల్టర్ కేటీఆర్ అని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



