త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | బాధ్య‌త‌తో చేసిన సినిమా – డ‌బ్బులు, అవార్డులు ఇవ్వ‌ని తృప్తి ఇచ్చింది – “ర‌ణ‌బాలి”పై విజ‌య్ దేవ‌ర‌కొండ కామెంట్స్‌

రాయ‌ల‌సీమ‌తో త‌న‌కు మంచి అనుబంధ‌ముంద‌ని టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. ఇక్క‌డే తాను చ‌దువుకున్నాన‌ని, ఒక‌ప్పుడు కొత్త చెరువు అనే ఊరిలో సినిమాలు చూశాన‌ని, అదే థియేట‌ర్‌లో త‌న సినిమా హౌజ్‌ఫుల్‌తో ఆడ‌టం గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ర‌ణ‌బాలి ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూవీ స‌క్సెస్ మీట్ శుక్ర‌వారం అనంత‌పూర్‌లో నిర్వ‌హించారు.

N

Entertainment | Published On Oct 24, 2026, 2.34 pm IST

Vijay Deverakonda | బాధ్య‌త‌తో చేసిన సినిమా – డ‌బ్బులు, అవార్డులు ఇవ్వ‌ని తృప్తి ఇచ్చింది – “ర‌ణ‌బాలి”పై విజ‌య్ దేవ‌ర‌కొండ కామెంట్స్‌
Advertisement

Vijay Deverakonda | తాను పుట్టిన తెలంగాణలో ఒక ఆవేశం ఉంటుంది, తిరగబడే పోరాటం ప‌ఠిమ ఉంటుంద‌ని అన్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న హీరోగా న‌టించిన ర‌ణ‌బాలి మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. ర‌ణ‌బాలి స‌క్సెస్ మీట్‌ను అనంత‌పురంలో నిర్వ‌హించారు.

తెలుగు గ‌డ్డ‌...

ఈ వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ తెలుగు గడ్డ ఎంతో గొప్పది, అందమైనది, ఎంతో చరిత్ర ఉన్నది. రకరకాల పండుగలు, పద్దతులు, యాసలు, మనుషులు ఉన్న నేల ఇది. నేను పుట్టిన తెలంగాణలో ఒక ఆవేశం ఉంటుంది, తిరగబడే పోరాటం ఉంటుంది, ఫోక్ సాంగ్స్ లో మజా ఉంటుంది. ఆంధ్ర వెళ్తే చక్కటి వాతావరణం, మంచి మనుషులు, ఆప్యాయత, వాళ్లు జరుపుకునే అందమైన పండుగలు క‌నిపిస్తాయి. సీమ‌కు వస్తే రణబాలిలో రాయలు ఏలిన సీమ గడ్డ అంటూ ఒక పాట ఉంది. అది నాకు చాలా ఇష్టం. ఈ నాలుగు లైన్ల పాట మన సీమ ఎలాంటిదో చూపిస్తాయి. ఈ రాయలసీమ నాకు ఎంతో ఇచ్చింది.

ఇక్క‌డే చ‌దువుకున్న‌...

నేను చదువుకుంది ఇక్కడే. అనంత‌పురంలోని కొత్త‌ చెరువు అనే ఊరిలో ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ లో సినిమాలు చూశాను. ఇప్పుడు మా రణబాలి సినిమా అదే కొత్త చెరువు థియేటర్ లో హౌస్ ఫుల్స్ తో ఆడుతుంటే ఎంత అనందంగా ఉందో చెప్పలేను. నేను ప్రయాణం చేసిన అనంతపురం, కర్నూలు, కడప లోనే మా సినిమా షూటింగ్ చేశాం. చిత్రీకరణ సమయంలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేవి.

రుణం తీర్చుకోవాల‌నే...

రణబాలి సినిమాను ఒక నటుడిగా చేయలేదు. ఈ నేల కథను చెప్పాలనే బాధ్యతతో చేశాను. నాకు ఎంతో ప్రేమను పంచిన రాయలసీమ రుణం తీర్చుకోవాలనే కృతజ్ఞతతో రణబాలి సినిమా చేశాను. ఒక పెద్దాయన మా వీరుల కథ చెప్పావు బిడ్డా అని చేయి పట్టుకుని మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. మమ్మల్ని మేము తెరపై చూసుకున్నట్లు ఉందని మీరంతా చెబుతున్నారు. మీ ఆదరణతో వచ్చే తృప్తి ఏ డబ్బూ, ఏ అవార్డు ఇవ్వదు.

అర్థాన్ని ఇచ్చింది...

రణబాలి సినిమాను మీరు ఇంతగా అక్కున చేర్చుకోవడం నటుడిగా నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిన సినిమా ఇది. తెలుగు సినిమా గర్వపడేలా రణబాలి ఉంటుందని చెప్పాను. ఆ మాటను మీరు నిజం చేశారు. డైరెక్ట‌ర్‌. రాహుల్ ఎంత గొప్ప సినిమా చేశాడో భవిష్యత్ లో అందరికీ అర్థమవుతుంది. జయమ్మపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు నాపై పదేళ్లుగా ప్రేమ చూపిస్తున్నారు. ఇటీవల ఆ ప్రేమను మరింతగా చూస్తున్నా అని విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్కొన్నాడు. ఈ స‌క్సెస్ మీట్‌లో అభిమానుల కోసం ర‌ణ‌బాలి సినిమాలోని ఓ పాట పాడాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

 

Advertisement
Advertisement