త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Summer Holidays | ఈ నెల 24 నుంచి పాఠ‌శాల‌ల‌కు ఎండాకాలం సెల‌వులు

Summer Holidays | రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులు (Summer Holidays) ప్ర‌క‌టించింది.

G

Telangana | Published On Apr 2, 2026, 7.10 am IST

Summer Holidays | ఈ నెల 24 నుంచి పాఠ‌శాల‌ల‌కు ఎండాకాలం సెల‌వులు
Advertisement

Summer Holidays | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులు (Summer Holidays) ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 24 నుంచి సెల‌వులు ప్రారంభ‌మ‌వుతాయని తెలిపింది. 48 రోజుల‌పాటు ఎండాకాలం సెల‌వులు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించింది. 2026-27 విద్యా సంవ‌త్స‌రం జూన్ 12 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని పేర్కొంది.

ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రంలో ఇంకా సిల‌బ‌స్ పూర్తికాన‌ట్ల‌యితే ప్ర‌త్యేక త‌ర‌గ‌త‌లు నిర్వ‌హించుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చింది. కాగా, ఎండ‌ల తీవ్ర‌త పెర‌గ‌డంతో మార్చి 15 నుంచి ప్ర‌భుత్వం, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఒంటి పూట త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement