త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Summer | మ‌రో ఐదు రోజులు ఎండ‌లే ఎండ‌లు..! జ‌ర జాగ్ర‌త్త సుమా..!!

Summer | రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు తీసి బ‌య‌ట‌పెట్ట‌డానికి కూడా జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు.

S

Telangana | Published On May 17, 2026, 4.05 pm IST

Summer | మ‌రో ఐదు రోజులు ఎండ‌లే ఎండ‌లు..! జ‌ర జాగ్ర‌త్త సుమా..!!
Advertisement

Summer | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు తీసి బ‌య‌ట‌పెట్ట‌డానికి కూడా జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు. ఉద‌యం 11 నుంచి సాయంత్రం నాలుగైదు గంట‌ల వ‌ర‌కు ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల ర‌హ‌దారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. రైతులు, కూలీలు కూడా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చినా, కూలీ ప‌నులు చేయాల‌నుకున్నా.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అయితే వ‌చ్చే ఐదు రోజులు కూడా రాష్ట్రంలో మండుటెండ‌ల తీవ్ర‌త కొన‌సాగుతుంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. వ‌డ‌గాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఆదివారం ఐదు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. మ‌రో 16 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేయ‌గా.. 41 - 44 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయి. రేపు ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement