TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం
TGHRC | కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై సమగ్ర నివేదికలు సమర్పించాలని డీజీపీని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
TGHRC | త్రినేత్ర.న్యూస్: కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై సమగ్ర నివేదికలు సమర్పించాలని డీజీపీని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈనెల 7న జరిగిన ఈ రెండు ఘటనలపై దాఖలైన పిటిషన్లపై టీజీహెచ్ఆర్సీ చైర్‌పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లి సుధాకర్, ఇందిరా శోభన్ ఫిర్యాదు చేయగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మీడియా సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన ఎర్రవెల్లి, సిద్ధిపేట జిల్లా ఫామ్‌హౌస్ ఎదుట దళితులు నిరసన నిర్వహించారని.. ఈ సమయంలో బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్‌తో పాటు మరికొందరు పసుపు నీరు, పాలు చల్లి ప్రాంతాన్ని “శుద్ధి” చేసినట్లు, దళిత నిరసనకారులను అవమానకర పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన నిరసనల్లో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీ-షర్టులు తొలగించి, విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడినట్లు ఇందిరా శోభన్ ఆరోపించారు. మహిళా పోలీసు సిబ్బందికి ఇబ్బంది, మానసిక వేదన, అవమానాన్ని కలిగించడంతో పాటు వారి గౌరవం, భద్రతపై ప్రభావం చూపిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదులపై తదుపరి నివేదిక కోసం రెండు కేసులను అక్టోబర్ 9కి వాయిదా వేశారు.
తాజావార్తలు
- ●AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!
- ●Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- ●Madras Regiment | ఆ కక్షతోనే ఆర్మీ ఆయుధాలు దొంగిలింత
- ●Balmuri Venkat | 75 శాతం కానిస్టేబుల్ పోస్టులు ఆదివాసీలకు కేటాయించాలి: బల్మూరి వెంకట్
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ కొనాలంటే ఈ దేశమే బెస్ట్.. భారత్‌తో పోలిస్తే భారీ తేడా..
- ●సభలో కాంగ్రెస్ ఎత్తు.. బయట బీఆర్ఎస్ పైఎత్తు? ‘22ఏ’ చుట్టూ మారుతున్న పొలిటికల్ గేమ్!

AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!

Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

Madras Regiment | ఆ కక్షతోనే ఆర్మీ ఆయుధాలు దొంగిలింత

Balmuri Venkat | 75 శాతం కానిస్టేబుల్ పోస్టులు ఆదివాసీలకు కేటాయించాలి: బల్మూరి వెంకట్




