Schools Bandh | ఢిల్లీలో విద్యార్థులపై దాడి.. రాష్ట్రంలో విద్యా సంస్థలు బంద్..
Schools Bandh | నీట్ పేపర్ లీక్‌కు బాధ్యతవహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు (Student Organizations) చేపట్టిన చలో పార్లమెంట్ రణరంగమైన (Delhi Protest) విషయం తెలిసిందే. విద్యార్థులపై (Students) పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు.
Schools Bandh | త్రినేత్ర.న్యూస్: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యతవహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు (Student Organizations) చేపట్టిన చలో పార్లమెంట్ రణరంగమైన (Delhi Protest) విషయం తెలిసిందే. విద్యార్థులపై (Students) పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. దీంతో చాలా విద్యార్థులు గాయపడ్డారు. దీనికి నిరసగా ఈ నెల 24న (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు (Schools Bandh) ఎన్ఎస్‌యూఐతోపాటు ఏఐఎస్ఎఫ్ (NSUI), ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జులై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నారు. విద్యార్థుల భద్రతను, భవిష్యత్తును కేంద్ర విద్యాశాఖ గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU)తో పాటు కేయూ (KU), పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. జులై 24న జరగబోయే ఈ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు యూనివర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
తాజావార్తలు
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!
- ●Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి
- ●DGP CV Anand | పెట్రోలింగ్ పెంచండి.. ఆస్తి నేరాలకు చెక్ పెట్టండి

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!




