త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garima Agrawal | న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. హెచ్చ‌రించిన క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్‌..

Garima Agrawal | జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు విస్తరణపై సమీక్ష నిర్వహించారు. రైతులు నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

P

Telangana | Published On Apr 28, 2026, 8.45 pm IST

Garima Agrawal | న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. హెచ్చ‌రించిన క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్‌..
Advertisement

Garima Agrawal | రాజ‌న్నసిరిసిల్ల జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరించారు. రానున్న ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై జిల్లా అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జరిగిన సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, సహకార, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సన్న వడ్ల సాగు విస్తీర్ణం పెంపు, ఆయిల్ పామ్ పంట అభివృద్ధి, ఫార్మర్స్ రిజిస్ట్రీ పూర్తి వంటి అంశాలపై చర్చించారు.

కేసులు న‌మోదు చేయాలి..

ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖలు రూపొందించిన సన్న వడ్ల రకాలు, ఆయిల్ పామ్ సాగు వివరాల కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. జిల్లాలో ఎలాంటి నకిలీ విత్తనాల అమ్మకాలు జరగకుండా వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కంపెనీ వివరాలు లేకుండా విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రైతులు నేరుగా వచ్చే వ్యక్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఫార్మర్స్ రిజిస్ట్రీ 73 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

స‌న్న వ‌డ్ల సాగు పెంచాలి..

రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం సన్న వడ్ల సాగును పెంచాలని సూచించిన కలెక్టర్, రేషన్ షాపులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని తెలిపారు. రైతులకు రూ.500 బోనస్ కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలంలో అధిక ఆదాయం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఉద్యానవన శాఖకు 500 ఎకరాలు, మండల వ్యవసాయ అధికారులకు 50 ఎకరాలు, ఏఈఓలకు 30 ఎకరాలు, పీఏసీఎస్ బాధ్యులకు 120 ఎకరాల చొప్పున లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులను నేరుగా సంప్రదించి సాగుకు ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇప్పటికే డీడీలు చెల్లించిన రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు, మొక్కలు అందించి నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు.

Advertisement
Advertisement