Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ కేసు.. నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ
Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి నిధి అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం హైదరాబాద్‌లో విచారించింది. నోటీసుల మేరకు ఈడీ కార్యాలయానికి హాజరైన ఆమె.. అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు సమాచారం.
Entertainment | Published On Aug 19, 2026, 4.22 pm IST
Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి నిధి అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం హైదరాబాద్‌లో విచారించింది. నోటీసుల మేరకు ఈడీ కార్యాలయానికి హాజరైన ఆమె.. అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా తన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రచారం కల్పించినందుకు నిధికి అందిన పారితోషికం, ఆ లావాదేవీల తీరుపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ చెల్లింపులు ఏ మార్గంలో జరిగాయి? ఎవరెవరి ద్వారా నగదు బదిలీ అయ్యింది? తదితర అంశాలపై వివరాలు సేకరించినట్లు తెలిసింది.
ప్రచారాలకు సంబంధించిన చెల్లింపులు హవాలా మార్గంలో జరిగినట్లు వచ్చిన ఆరోపణలపైనా ఈడీ దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఈడీ విచారించింది. ఇప్పటివరకు 21 మంది ప్రముఖులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. తెలంగాణలో అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై నమోదైన కేసుల ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే వ్యవహారానికి సంబంధించి గత నవంబర్‌లో తెలంగాణ సీఐడీ ఎదుట సైతం నిధి అగర్వాల్ హాజరై తన వాదనలు వినిపించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026

Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?
ఆగస్టు 19, 2026

Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 'ఫ్రీ లీగల్ సెల్' : ఫోన్ నెంబర్ ఇదే!
- ●Abhijeet Dipke | నిరుపయోగంగా ఉన్న పీఎం కేర్స్ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఉపయోగించండి : అభిజీత్ దిప్కే
- ●Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
- ●SIM Card Rules | 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్నవారికి షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..
- ●Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం
- ●Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?

22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 'ఫ్రీ లీగల్ సెల్' : ఫోన్ నెంబర్ ఇదే!

Abhijeet Dipke | నిరుపయోగంగా ఉన్న పీఎం కేర్స్ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఉపయోగించండి : అభిజీత్ దిప్కే

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి

SIM Card Rules | 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్నవారికి షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..



