త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే వాళ్లకు పోలీసులంటే భయం ఉండేలా చర్యలుండాలి: జ‌గ్గారెడ్డి

Jagga Reddy | అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే వాళ్లకు పోలీసులంటే భయం ఉండేలా చర్యలుండాలని టీపీసీసీ (TPCC) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు జ‌గ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. ఇంటిదగ్గరే ఎఫ్ఐఆర్ (FIR) నిర్ణ‌యంపై సీఐడీ అధికారి చారు సిన్హా, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్‌ల‌ను అభినందించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమ‌న్నారు.

A

Telangana | Published On Jan 29, 2026, 8.36 pm IST

Jagga Reddy | అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే వాళ్లకు పోలీసులంటే భయం ఉండేలా చర్యలుండాలి: జ‌గ్గారెడ్డి
Advertisement

Jagga Reddy | త్రినేత్ర‌.న్యూస్‌ : అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే వాళ్లకు పోలీసులంటే భయం ఉండేలా చర్యలుండాలని టీపీసీసీ (TPCC) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు జ‌గ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. ఇంటిదగ్గరే ఎఫ్ఐఆర్ (FIR) నిర్ణ‌యంపై సీఐడీ అధికారి చారు సిన్హా, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్‌ల‌ను అభినందించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమ‌న్నారు. గాంధీభ‌వ‌న్‌లో గురువారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ అమ్మాయిల్ని ట్రాప్ చేసే క్రిమినల్స్‌కు స‌జ్జ‌నార్ చ‌ర్య‌లే స‌రైన‌వ‌ని త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని చెప్పారు. బాధిత అమ్మాయిల వివరాలు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత పోలీసులదేన‌న్నారు.

సెక్స్ పరమైన, వ్యక్తిగత వ్యవహారాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, యూట్యూబ్, సోషల్ మీడియా కొంచెం బాధ్య‌త‌తో న‌డుచుకోవాల‌ని సూచించారు. అలాంటి వార్తలు ప్ర‌చురించ‌కూడ‌ద‌ని కోరారు. క్రైమ్ రిపోర్టర్‌ల దగ్గర సమాచారం ఉంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాల‌ని కానీ వివ‌రాల‌కు బ‌హిర్గ‌తం చేయ‌కూడ‌ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మీడియాలో క‌థ‌నాలు సైతం రాయ‌వ‌ద్ద‌ని సూచించారు. మహిళల భయాలు ఆసరాగా తీసుకుని కొందరు ఆకతాయిలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. ప్రైవసీ, ఇష్టాయిష్టాలలో ఇంకొకరు వేలు పెట్టొద్దని అభిప్రాయ‌ప‌డ్డారు. సైకో.. బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళ విషయంలో చట్టాలు, న్యాయ‌స్థానాలున్నాయ‌ని చెప్పారు.

తాను రాజకీయ నాయకుడిగా పోలీసులతో కోట్లాడతాన‌న్న ఆయ‌న ఇది పొలిటిక‌ల్ గేమ్ అని అన్నారు. పోలీస్.. పాలిటిక్స్ ఎప్పుడూ ఉండేవేన‌ని పేర్కొన్నారు. వైఎస్సార్‌ హయంలో ఓ అమ్మాయిని సతాయించిన వాళ్ళను ఎన్కౌంటర్ చేశారని, బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోనూ ఒక ఎన్‌కౌంట‌ర్ చేశార‌ని గుర్తు చేశారు. వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు వేర‌ని, రాజ్యాంగ ప‌రంగా ఎన్‌కౌంట‌ర్‌ను స‌మ‌ర్థించ‌లేమ‌ని వివ‌రించారు. కానీ వ్య‌క్తిగ‌తంగా స‌మ‌ర్థిస్తుంటార‌ని చెప్పారు. మోస‌పోయిన అమ్మాయికి భ‌రోసా ఇచ్చేలా పోలీసు చ‌ర్య ఉండాల‌న్నారు. మోసం చేయాల‌న్న ఆలోచ‌న వ‌స్తేనే భ‌యం క‌లిగేలా చేయాల‌ని సూచించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement