Bhatti Vikramarka | పంట అవశేషాల దహనంపై విస్తృత అవగాహన కల్పించాలి.. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం..
Bhatti Vikramarka | పంట అవశేషాలను పొలాల్లో కాల్చడం వల్ల కలిగే నష్టాలపై గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
State Reviews Paddy Procurement; Dy CM Bhatti Vikramarka Calls for Awareness on Crop Residue Burning
Bhatti Vikramarka | పంట అవశేషాలను పొలాల్లో కాల్చడం వల్ల కలిగే నష్టాలపై గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ పౌర సరఫరాల సంస్థ కార్యాలయం నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ యాసంగి-2026 ధాన్యం కొనుగోళ్లు అనేక సవాళ్ల మధ్యనైనా విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది భారీ స్థాయిలో వరి దిగుబడి వచ్చినప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల మంత్రివర్గం సన్‌ఫ్లవర్ పంట కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంట అవశేషాలను కాల్చకుండా రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ చర్యల వల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా అగ్ని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. వచ్చే 15 నుంచి 30 రోజుల పాటు ప్రతి గ్రామంలో టామ్‌టామ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల అనంతరం కూడా పంట అవశేషాలను కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికంగా హమాలీలు, రవాణా సమస్యల పరిష్కారానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సన్‌ఫ్లవర్ పంట కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. చివరి గింజ వరకు పంట కొనుగోలు జరగాలని, వరి కొయ్యలను కాల్చకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో
మహిళా వారోత్సవాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వేడుకలు రోజు వారీగా ఘనంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అన్ని జిల్లాల్లో మహిళా వారోత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. మహిళా, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మెప్మా శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, అవసరమైన వాహనాలు సమకూర్చాలని, హమాలీల సంఖ్యను పెంచాలని కూడా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ మహేశ్ బి గితె, సిరిసిల్ల ఆర్డీఓ రాజేందర్ రెడ్డి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, డీటీఓ లక్ష్మణ్ కుమార్, డీసీఎస్ఓ బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీఏఓ అఫ్జల్ బేగం, డీసీఓ రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?





