Ponnam Prabhaker | ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్
Ponnam Prabhakar | కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నరేంద్ర మోదీ ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు పెడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar | హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నరేంద్ర మోదీ ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు పెడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ చట్టం పేరు మార్చి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఈ చట్టంలో మీరు తెస్తున్న సంస్కరణలు గొప్పవి అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదు. పార్లమెంట్‌క్షలో హడావిడిగా బిల్లులు ఎందుకు తెస్తున్నారు. తక్షణమే బిల్లులు ఉపసంహరించుకోవాలి అని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోతలు విధిస్తున్నారు. గాంధీ పేరు మార్చి.. గాంధీని అవమాన పరుస్తున్నారు.. ఇప్పటికే మీకు గాడ్సే వారసులుగా పేరు ఉంది. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ఉపాధి కల్పించింది. ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ కాబట్టి దానిని చంపే కుట్ర జరుగుతుంది. ఒక చట్టాన్ని మార్పు చేర్పులు చేస్తున్నప్పుడు రాష్ట్రాలతో చర్చించాలి కదా.. వారి అభిప్రాయాలు తీసుకోవాలి కదా అని పొన్నం ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నికిల్ దేయ్, అరుణ రాయ్, హరగోపాల్, శాంత సిన్హా లాంటి మేధావులతో చర్చించి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా ఉపాధి దొరుకుతుంది కానీ పట్టణ ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా ఉపాధి హామీ తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా..? ఇప్పుడు పట్టణ పేదరికం పోగొట్టడానికి ఉపాధి హామీ తెచ్చే బదులు ఉన్న ఉపాధి హామీ తొలగించే ప్రయతం చేస్తుంది. దాని స్ఫూర్తిని, ఆత్మను చంపే కుట్ర చేస్తుంది. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటుంది. సెస్‌ల పేరుతో దోచుకుంటుంది.. 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు మోయాలని భారం మోపుతోంది. ఇప్పటికే జీఎస్టీ సెంట్రలైజ్ మీద రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఫెడరల్ స్ఫూర్తిని చంపే ప్రయత్నం చేస్తుంది. దీనిని అడ్డుకుంటాం.. పోరాటాలు చేస్తాం.. తక్షణమే ఉపాధి హామీ బిల్లులు వెనక్కి తీసుకోవాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



