త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | 18న మేడారంలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారం(Medaram) లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) (Cabinet Meeting) నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.

A

Telangana | Published On Jan 16, 2026, 4.54 pm IST

Ponguleti Srinivas Reddy | 18న మేడారంలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం: మంత్రి పొంగులేటి
Advertisement

దానిని చారిత్ర‌క ఘ‌ట్టంగా అభివ‌ర్ణ‌న‌
అదే రోజు పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డి
రూ. 362 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతార‌ని స్ప‌ష్టం

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌ : రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారం(Medaram) లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) (Cabinet Meeting) నిర్వహించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం త‌మ‌ అలవాటు కాదని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాత ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వివ‌రించారు.

అభివృద్ధి బాట‌లో పాలేరు..

మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు.. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తారన్నారు. కూసుమంచిలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తార‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని పొంగులేటి తెలిపారు.

అద్భుత నిర్వ‌హ‌ణ‌కు విస్తృత ఏర్పాట్లు

స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19న‌ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement