త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Unrest | ఇరాన్‌లో 9వేల‌కుపైగా భార‌తీయులు చిక్కుకుపోయారు : విదేశాంగ ప్ర‌తినిధి

Iran Unrest | ఇరాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు దిగ‌జారుతున్నాయి. ఇప్ప‌టికే ఆ దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇటీవ‌ల త‌క్ష‌ణం ఆ దేశాన్ని వీడాల‌ని భార‌త ప్ర‌భుత్వం అడ్వైజ‌రీ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇరాన్‌లో 9వేల‌కుపైగా భార‌తీయ పౌరులు చిక్కుకుపోయార‌ని.. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నార‌ని విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ తెలిపారు.

P

National | Published On Jan 16, 2026, 6.50 pm IST

Iran Unrest | ఇరాన్‌లో 9వేల‌కుపైగా భార‌తీయులు చిక్కుకుపోయారు : విదేశాంగ ప్ర‌తినిధి
Advertisement

Iran Unrest | ఇరాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు దిగ‌జారుతున్నాయి. ఇప్ప‌టికే ఆ దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇటీవ‌ల త‌క్ష‌ణం ఆ దేశాన్ని వీడాల‌ని భార‌త ప్ర‌భుత్వం అడ్వైజ‌రీ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇరాన్‌లో 9వేల‌కుపైగా భార‌తీయ పౌరులు చిక్కుకుపోయార‌ని.. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నార‌ని విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌరుల భ‌ద్ర‌త విష‌జ్ఞంలో నిఘా వేసి ఉంచిన‌ట్లు చెప్పారు. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, భారత ప్రభుత్వం రెండు, మూడు అడ్వైజ‌రీలు జారీ చేసింద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం ఇరాన్‌కు వెళ్లొద్ద‌ని పౌరుల‌కు సూచించింది. ఇరాన్‌లో ఉన్న భార‌తీయులు సుర‌క్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు అందుబాటులో ఉన్న మార్గాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని కోరింది.

ఇరాన్‌లో పరిస్థితిని భారత ప్రభుత్వం నిరంతరం, నిశితంగా పర్యవేక్షిస్తోందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తుందని, వారికి సహాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. షాక్స్‌గామ్ లోయ అంశంపై ఆయ‌న స్పందిస్తూ ఈ విష‌యంలో భార‌త్ వైఖ‌రిని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశామ‌న్నారు. చాబహార్ పోర్టుపై మాట్లాడుతూ అమెరికా గ‌తేడాది అక్టోబర్ 28న షరతులతో కూడిన ఆంక్షలపై మార్గదర్శక లేఖను జారీ చేసిందని, ఇది ఈ ఏడాది ఏప్రిల్ 26 చెల్లుబాటు అవుతుంద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో అమెరికాతో భార‌త్ క‌లిసి ప‌ని చేస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌య‌న్మార్ ఎన్నిక‌ల‌పై స్పందించారు. నిష్పాక్షికంగా ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌య‌న్మార్‌లో రెండుద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. భ‌విష్య‌త్‌లో మ‌రికొన్ని ద‌శ‌ల్లో జ‌రుగ‌నున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement