త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | పండుగ‌ల‌కు ఊరెళ్తున్నారా..? చర్లపల్లి–నాగర్‌కోయిల్ మ‌ధ్య ఐదు ప్ర‌త్యేక రైళ్లు..!

Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి–నాగర్‌కోయిల్‌ మధ్య ఈ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 07535 చర్లపల్లి–నాగర్‌కోయిల్‌ ప్రత్యేక రైలు సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 23 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండ‌నుంది.

P

Telangana | Published On Sep 19, 2026, 8.23 pm IST

Special Trains | పండుగ‌ల‌కు ఊరెళ్తున్నారా..? చర్లపల్లి–నాగర్‌కోయిల్ మ‌ధ్య ఐదు ప్ర‌త్యేక రైళ్లు..!
Advertisement

Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి–నాగర్‌కోయిల్‌ మధ్య ఈ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 07535 చర్లపల్లి–నాగర్‌కోయిల్‌ ప్రత్యేక రైలు సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 23 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండ‌నుంది. 07536 నాగర్‌కోయిల్‌–చర్లపల్లి ప్రత్యేక రైలు సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 25 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లో నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, విరుదాచలం, తిరుచ్చిరాపల్లి, డిండిగల్, మదురై, విరుదునగర్, సాతూర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వళ్లియూర్‌ స్టేషన్లలో ఆగుతాయి. రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement
Advertisement