త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Speaker vs Talasani | స్పీక‌ర్ వ‌ర్సెస్ త‌ల‌సాని.. ప్ర‌తిసారి క‌లుగ‌జేసుకుంటే మ‌ర్యాద ఉండ‌దు

Speaker vs Talasani | శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది.

S

Telangana | Published On Mar 17, 2026, 1.12 pm IST

Speaker vs Talasani | స్పీక‌ర్ వ‌ర్సెస్ త‌ల‌సాని.. ప్ర‌తిసారి క‌లుగ‌జేసుకుంటే మ‌ర్యాద ఉండ‌దు
Advertisement

Speaker vs Talasani | త్రినేత్ర‌.న్యూస్ : శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఈ శాస‌న‌స‌భ‌లో స్పీక‌ర్ గారు అనేది ఒక రాజ‌కీయ పార్టీకి సంబంధించింది కాదు.. మా అంద‌రికీ స్పీక‌ర్ మీరు అని త‌ల‌సాని పేర్కొన్నారు. ఇక వెంట‌నే స్పీక‌ర్ క‌లుగ‌జేసుకుని.. అందుకే మీకు మైక్ ఇచ్చాను అని త‌ల‌సానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దీంతో త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కూడా ఘాటుగా స్పందించారు. ఈ స‌భ‌కు మీరు స్పీక‌ర్.. అంద‌రి హ‌క్కులు కాపాడాలి. డిప్యూటీ సీఎం ఇక్క‌డ ఉన్నారు. బాలు నాయ‌క్, ఆది శ్రీనివాస్ మాట్లాడారు. మేం మైక్ అడిగి అబ్జెక్ష‌న్ చేయ‌లేదు. వారు మాట్లాడిన త‌ర్వాత‌ మా స‌భ్యుడికి అవ‌కాశం వ‌చ్చింది. రిప్లే ఇచ్చే అధికారం సీఎం, డిప్యూటీ సీఎంకు ఉంది. కానీ మంత్రులు, ఇత‌ర స‌భ్యులు ప్ర‌తిసారి క‌లుగ‌జేసుకుంటే స‌భా మ‌ర్యాద‌ల‌కు స‌రికాదు. స్పీక‌ర్‌ను రెక్వెస్టు చేస్తున్నాం.. మీరు మా హ‌క్కుల‌ను కాపాడాలి. మీరు అడిగార‌ని మేం ఇచ్చామ‌ని చెప్ప‌డం కాదు. రైట్ రాయ‌ల్‌గా రావాల్సిన‌టువంటి హ‌క్కు అది. మంత్రుల‌ను రెక్వెస్టు చేస్తున్నాం.. స‌భ్యులంటే ఆరుస్త‌రు.. మంత్రులు బాధ్య‌త‌గా నోట్ చేసుకోవాలి. ప్ర‌తిసారి క‌లుగ‌జేసుకుంటే మ‌ర్యాద ఉండ‌దు. గ‌త స‌భ‌లో అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టు చెప్ప‌డంతో మేం బ‌య‌ట‌కు వెళ్లిపోయాం. ద‌య‌చేసి మా హ‌క్కుల‌ను కాపాడాలి స్పీక‌ర్ గారూ.. ఇద్ద‌రు స‌భ్యులు అనేక విష‌యాలు మాట్లాడారు. కొన్ని వాస్త‌వాలు ఉన్నాయి అవాస్త‌వాలు ఉన్నాయి. అయినా కూడా మేం విన్నాం. మేం చెప్పే వాటిని కూడా నోట్ చేసుకోని రిప్లైలో చెప్ప‌మ‌నండి. అన్ని విష‌యాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement