త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kadiam Srihari | రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు క‌డియం శ్రీహ‌రి విచార‌ణ‌..!

Kadiam Srihari | ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదు వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రికి స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు.

S

Telangana | Published On Feb 3, 2026, 1.56 pm IST

Kadiam Srihari | రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు క‌డియం శ్రీహ‌రి విచార‌ణ‌..!
Advertisement

Kadiam Srihari | త్రినేత్ర‌.న్యూస్ : ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదు వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రికి స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి మార‌డాన్ని స‌వాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన‌ర్హ‌త పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని క‌డియం శ్రీహ‌రికి స్పీక‌ర్ మంగ‌ళ‌వారం నోటీసులు జారీ చేశారు. రేపు ఉద‌యం క‌డియంను విచారించ‌నున్నారు. క‌డియం, కేపీ వివేకానంద వాద‌న‌ల‌ను స్పీక‌ర్ విన‌నున్నారు.

ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌గా, ఇందులో ఏడుగురికి స్పీక‌ర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరు పార్టీ మారిన‌ట్లు ఆధారాల్లేవ‌ని, వారంతా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్న‌ట్లు స్పీక‌ర్ పేర్కొన్నారు. ఇక క‌డియం విచార‌ణ రేపు జ‌ర‌గ‌నుంది. దానం నాగేంద‌ర్ పిటిష‌న్ ఇంకా విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ వ్య‌వ‌హారంపై స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

Advertisement
Advertisement