Alert | దీపావళి వేళ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్షే..!
Alert | దీపావళి పండుగ నేపథ్యంలో రైలు ప్రయాణికుల భద్రతకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో బాణసంచా, మండే స్వభావం కలిగిన ద్రవాలు, పేలుడు పదార్థాలు, ఇతర ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లవద్దని ప్రయాణికులకు సూచించింది.
Alert | దీపావళి పండుగ నేపథ్యంలో రైలు ప్రయాణికుల భద్రతకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో బాణసంచా, మండే స్వభావం కలిగిన ద్రవాలు, పేలుడు పదార్థాలు, ఇతర ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లవద్దని ప్రయాణికులకు సూచించింది. ఇలాంటి వస్తువుల రవాణా వల్ల ప్రయాణికుల ప్రాణాలకు, రైల్వే ఆస్తులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రైల్వే నిబంధనల ప్రకారం నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 164 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1,000 వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని పేర్కొంది.
పండుగ సమయంలో రైలు ప్రయాణాలు సురక్షితంగా, సజావుగా సాగేందుకు రైల్వే స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు, నిఘాను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సహకరించాలని, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. అలాగే, రైళ్లలో.. రైల్వే ప్రాంగణాల్లో అనుమానాస్పద, పేలుడు, మండే స్వభావం కలిగిన వస్తువులు కనిపిస్తే వెంటనే సమీపంలోని రైల్వే అధికారులకు సమాచారం అందించాలని సూచించింది. రైల్వే సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 139 లేదా రైల్ మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ప్రయాణికులందరి సహకారంతో సురక్షితమైన, ప్రశాంతమైన దీపావళి ప్రయాణాలను అందించేందుకు కృషి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nitin Nabin | కరీంనగర్ పాదయాత్రకు నేనొస్తా.. బండికి నితిన్ నబిన్ హామీ
- ●SIR | ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయా? ఓటర్లకు ఈసీ మరో ఛాన్స్..!
- ●Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం
- ●Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ - హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ
- ●Model Schools | మోడల్ స్కూల్ సమస్యలకు మోక్షమెప్పుడు?
- ●Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ - మలయాళ బ్యూటీ రియాక్షన్

Nitin Nabin | కరీంనగర్ పాదయాత్రకు నేనొస్తా.. బండికి నితిన్ నబిన్ హామీ

SIR | ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయా? ఓటర్లకు ఈసీ మరో ఛాన్స్..!

Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం

Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ - హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ




