త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | ద‌స‌రా, దీపావ‌ళి ర‌ద్దీ.. ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

Special Trains | రాబోయే ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌, నరసాపూర్‌–చర్లపల్లి, పొదనూరు–బరౌనీ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు నిర్ణీత తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించింది.

P

Telangana | Published On Sep 25, 2026, 3.37 pm IST

Special Trains | ద‌స‌రా, దీపావ‌ళి ర‌ద్దీ.. ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే
Advertisement

Special Trains | రాబోయే ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌, నరసాపూర్‌–చర్లపల్లి, పొదనూరు–బరౌనీ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు నిర్ణీత తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించింది. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ మధ్య 07039 నంబర్‌ ప్రత్యేక రైలు అక్టోబర్‌ 7 నుంచి నవంబర్‌ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. సికింద్రాబాద్‌లో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07040 నంబర్‌ రైలు అక్టోబర్‌ 8 నుంచి నవంబర్‌ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. కాకినాడ టౌన్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉన్నాయ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది.

న‌ర్సాపూర్‌-చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య..

న‌ర్సాపూర్‌–చర్లపల్లి మధ్య 07062 నంబర్‌ ప్రత్యేక రైలు అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. నరసాపూర్‌లో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 07063 నంబర్‌ రైలు అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 30 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. చర్లపల్లిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నరసాపూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. అలాగే, పొదనూరు–బరౌనీ మధ్య 06021 నంబర్‌ ప్రత్యేక రైలు అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 1 వరకు ప్రతి ఆదివారం రాక‌పోక‌లు సాగిస్తుంది. పొదనూరులో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 06022 నంబర్‌ ప్రత్యేక రైలు అక్టోబర్‌ 7 నుంచి నవంబర్‌ 4 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. బరౌనీలో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు పొదనూరు చేరుతుంది.

ఈ రైలు తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూర్‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హార్షా, చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌, బేతుల్‌, ఇటార్సి, పిపారియా, గాడర్‌వారా, జబల్‌పూర్‌, జబల్‌పూర్‌–కట్ని మార్గంలోని కట్ని, మైహార్‌, సత్నా, మాణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ ఛెయోకి, చునార్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌, బక్సర్‌, ఆరా, దానాపూర్‌, పాటలీపుత్ర, సోన్‌పూర్‌, హాజీపూర్‌, షాహ్‌పూర్‌ పటోరీ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫ‌స్ట్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. పండగల సందర్భంగా వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో దాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా తేదీల్లో ప్రయాణించే వారు రైలు నంబర్‌, ప్రయాణ తేదీ, బయలుదేరు సమయాలను గమనించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని రైల్వే సూచించింది.

Advertisement
Advertisement