త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. చర్లపల్లి -కాకినాడ టౌన్‌-చర్లపల్లి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి, విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.

P

Telangana | Published On Jan 17, 2026, 6.47 pm IST

Special Trains | ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Advertisement

Special Trains | సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. చర్లపల్లి -కాకినాడ టౌన్‌-చర్లపల్లి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి, విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.

చర్లపల్లి-కాకినాడ టౌన్‌ (07480) రైలు ఈ నెల 19న అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటలకు బయలుదేరి.. అదే రోజు రాత్రి 9.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. కాకినాడ టౌన్‌ (07481) రైలు 19న రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక చర్లపల్లి-తిరుపతి (07482) నంబరు గల ప్రత్యేక రైలు 18న ఉదయం 4 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుపతి-చర్లపల్లి (07483) నంబరు గల రైలు తిరుగు ప్రయాణంలో రాత్రి 9.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు మధ్యస్థానం చేరుకుంటుంది. ఈ రైలు జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నక్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఇక విశాఖపట్నం-చర్లపల్లి (08517) రైలు 18న మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. చర్లపల్లి-విశాఖపట్నం (08518) రైలు 19న ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు అర్ధరాత్రి 12.30గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్‌, కాజీపేట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement