త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPS Transfers in Telangana | తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఫ్యూచర్ సిటీకి కొత్త బాస్‌లు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు కీలక అధికారులను కేటాయించింది.

J

Telangana | Published On Jan 17, 2026, 8.48 pm IST

IPS Transfers in Telangana | తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఫ్యూచర్ సిటీకి కొత్త బాస్‌లు
Advertisement

IPS Transfers in Telangana | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో మరోసారి భారీ మార్పులు చేపట్టింది. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు ప్రతిష్టాత్మకమైన 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్‌కు కీలక అధికారులను నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు జీవో నంబర్ 75 విడుదల చేశారు.

ప్రధాన బదిలీల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా బదిలీ అయిన అధికారుల వివరాలు, వారికి కేటాయించిన కొత్త బాధ్యతలు కింది విధంగా ఉన్నాయి:

డా.గజరావు భూపాల్ (IPS 2008): సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి ఐజీ (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్)గా బదిలీ అయ్యారు. అదనంగా ఐజీ (స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్) బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.

అభిషేక్ మొహంతీ (IPS 2011): నార్కోటిక్స్ బ్యూరో డీఐజీ నుంచి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా బదిలీ.

ఆర్.భాస్కరన్ (IPS 2012): సీఐ సెల్ ఎస్పీ నుంచి అదే విభాగంలో (ఇంటెలిజెన్స్) డీఐజీగా పదోన్నతి పొందారు.

జి.చందనా దీప్తి (IPS 2012): రైల్వేస్ ఎస్పీ నుంచి కొత్తగా ఏర్పాటైన 'ఫ్యూచర్ సిటీ' అడిషనల్ కమిషనర్ (అడ్మిన్ అండ్ ట్రాఫిక్)గా నియమితులయ్యారు.

టి.అన్నపూర్ణ (IPS 2013): విజిలెన్స్ ఎస్పీ నుంచి సైబరాబాద్ డీసీపీ (అడ్మిన్)గా బదిలీ.

బి.కె.రాహుల్ హెగ్డే (IPS 2014): హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ నుంచి ట్రాఫిక్-III డీసీపీగా బదిలీ.

కె.అపూర్వా రావు (IPS 2014): హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.

ట్రాఫిక్ విభాగానికి కొత్త డీసీపీలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రభుత్వం కొత్త డీసీపీలను నియమించింది. అవినాష్ కుమార్ (ట్రాఫిక్-I), కాజల్ (ట్రాఫిక్-II), శేషాద్రిని రెడ్డి (సైబరాబాద్ ట్రాఫిక్-II) తదితరులు బాధ్యతలు చేపట్టనున్నారు.

ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్‌కు అధికారులుగా జి.చందనా దీప్తితో పాటు శివమ్ ఉపాధ్యాయ (ట్రాఫిక్ డీసీపీ)లను కేటాయించడం గమనార్హం.

మొత్తంగా ఈ బదిలీల ద్వారా పోలీసు యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement