త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Illegal Hunting | అట‌వీ జంతువుల‌ను వేటాడుతున్న ముఠా అరెస్ట్‌.. నాలుగు ఎయిర్ గ‌న్స్ స్వాధీనం..!

Illegal Hunting | షాద్‌నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లను ఉపయోగించి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, కముజు పిట్టలు మరియు పావురాలను అక్రమంగా వేటాడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను గోల్కొండ టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె శ్రీనివాసరావు తెలిపారు.

P

Telangana | Published On May 5, 2026, 8.35 pm IST

Illegal Hunting | అట‌వీ జంతువుల‌ను వేటాడుతున్న ముఠా అరెస్ట్‌.. నాలుగు ఎయిర్ గ‌న్స్ స్వాధీనం..!
Advertisement

Illegal Hunting | షాద్‌నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లను ఉపయోగించి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, కముజు పిట్టలు మరియు పావురాలను అక్రమంగా వేటాడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను గోల్కొండ టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో నిందితుల వద్ద నుంచి వేటకు సంబంధించిన వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లు, భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

. హైదరాబాద్ అలీజాకోట్లకు చెందిన మొహమ్మద్ ముజఫర్ హుస్సేన్ అలియాస్ గుడ్డు (42), జ‌డ్చ‌ర్ల‌కు చెందిన మీర్ అహ్మ‌ద్ (27), అలీజా కోట్లకు చెందిన అబ్దుల్లా బిన్ సహైన్ (27), మొఘల్‌పురాకు చెందిన సౌద్ బిన్ మొహమ్మద్ బలాబ్ (41), అలీజా కోట్లకు చెందిన మసూద్ బిన్ మొహమ్మద్ (43), మక్తల్ ముస్తిపల్లికి చెందిన కే శేఖర్ (38) ముఠాగా ఏర్ప‌డిన‌ట్లుగా తెలిపారు. ఇందులో శేఖ‌ర్ వ‌న్య ప్రాణుల క‌ద‌లిక‌ల‌ను గుర్తించి వారికి స‌మాచారం అందిస్తాడ‌ని పేర్కొన్నారు. వేట కోసం ఈ ముఠా సభ్యులు గత ఏడాది కాలంగా షాద్‌నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో తరచుగా సంచరించినట్లు దర్యాప్తులో తేలిందని అందె శ్రీనివాసరావు తెలిపారు. జింకలు, నెమళ్లు సహా వన్యప్రాణులను ఎయిర్ గన్లతో కాల్చి చంపి, మాంసాన్ని వండుకుని తినేవారని చెప్పారు. వేట అనంతరం జంతువుల అవశేషాలను జూరాల బ్యాక్ వాటర్స్ కాలువలో పడేసినట్లు గుర్తించారు.

నిందితుడు మీర్ అహ్మద్ అమీర్ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్‌లో షూటర్ అయినప్పటికీ, తన లైసెన్స్డ్ రైఫిల్‌ను అక్రమ వేట కోసం ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణలో భాగంగా గ‌తేడాది జ‌న‌వ‌రి నుంచి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు పలు సందర్భాల్లో వేట జరిగినట్లు గుర్తించారు. నెమళ్లు, జింకల వేటతో పాటు మాంసాన్ని నిల్వ చేసి వినియోగించినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో మొత్తం 4 ఎయిర్ గన్లు, ఒక లైసెన్స్డ్ స్పోర్టింగ్ రైఫిల్, 20 బుల్లెట్లు, స్కార్పియో వాహనం, 8 మొబైల్ ఫోన్లు, ఒక బటన్ నైఫ్, ఎయిర్ గన్ పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి, నిందితులను హైద‌రాబాద్ ఈస్ట్ రేంజ్‌కు అప్ప‌గించిన‌ట్లు పేర్కొన్నారు. ఆపరేషన్‌ను అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఆర్ వెంకటేష్, ఎస్‌ఐ కే వెంకటరమణ, గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన వివ‌రించారు.

Advertisement
Advertisement