త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping | సిట్ దూకుడు.. కేటీఆర్‌కు నోటీసులు

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ (CIT) త‌న దూకుడును కొన‌సాగిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌ (KTR)కు నోటీసులు జారీ చేసింది. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సూచించింది.

A

Telangana | Published On Jan 22, 2026, 5.46 pm IST

Phone Tapping | సిట్ దూకుడు.. కేటీఆర్‌కు నోటీసులు
Advertisement

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ (CIT) త‌న దూకుడును కొన‌సాగిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు నందిన‌గ‌ర్‌లోని నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అంద‌జేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు సిట్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సూచించారు. ఇటీవ‌లి కాలంలో హైద‌రాబాద్ న‌గ‌ర సీపీ స‌జ్జ‌నార్‌ (Sajjanar) ను సిట్ చీఫ్‌గా నియ‌మిస్తూ, మ‌రికొంత మంది అధికారులను స‌భ్యులుగా ప్ర‌భుత్వం నియ‌మించింది. అనంత‌రం కేసు విచార‌ణ‌లో వేగం పెరిగింది. రెండు రోజుల క్రిత‌మే మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) ను ఆరున్న‌ర గంట‌ల పాటు సుదీర్ఘంగా విచారించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్‌రావు (Prabhakar Rao) ను సుప్రీం కోర్టు తీర్పు మేర‌కు రెండు వారాల పాటు సిట్ క‌స్టోడియ‌ల్ విచార‌ణ నిర్వ‌హించింది. అనంత‌రం ఎమ్మెల్సీ న‌వీన్‌రావును సుదీర్ఘంగా ప్ర‌శ్నించింది. ఎమ్మెల్సీ న‌వీన్‌రావు తండ్రి కొండ‌ల్‌రావు, కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు త‌న‌యుడు సందీప్‌రావుల‌ను సైతం విచారించింది. అనంత‌రం సిట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాద‌వ్‌, చిరుమ‌ర్తి లింగ‌య్య‌ల‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సోద‌రుడు కొండ‌ల్‌రెడ్డిల‌కు నోటీసులు జారీ చేసింది.

మూడు రోజుల క్రితం సింగ‌రేణి కుంభ‌కోణం అంశాన్ని హ‌రీశ్‌రావు బ‌హిర్గ‌తం చేయ‌డంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు సిట్ నోటీసులు జారీ చేసి సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిపింది. అదే క్ర‌మంలో తాజాగా కేటీఆర్‌కు నోటీసులు పంపింది. ప్ర‌భాక‌ర్‌రావు విచార‌ణ అనంత‌రం దీనికి సంబంధించిన నివేదిక‌ను ఈ నెలాఖ‌రులోపే కోర్టుకు స‌మ‌ర్పించాల్సిన నేప‌థ్యంలో సిట్ విచార‌ణ వేగ‌వంతం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement