త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కొన‌సాగుతున్న కేసీఆర్ సిట్ విచార‌ణ.. నందిన‌గ‌ర్‌లో భారీ బందోబ‌స్తు

KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచార‌ణ ప్రారంభ‌మైంది. నందిన‌గ‌ర్‌లోని కేసీఆర్ నివాసంలోని రెండో అంత‌స్తులోని ప్ర‌త్యేక గ‌దిలో సిట్ అధికారులు విచారిస్తున్నారు.

S

Telangana | Published On Feb 1, 2026, 3.00 pm IST

KCR | కొన‌సాగుతున్న కేసీఆర్ సిట్ విచార‌ణ.. నందిన‌గ‌ర్‌లో భారీ బందోబ‌స్తు
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచార‌ణ ప్రారంభ‌మైంది. నందిన‌గ‌ర్‌లోని కేసీఆర్ నివాసంలోని రెండో అంత‌స్తులోని ప్ర‌త్యేక గ‌దిలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచార‌ణ‌ను వీడియో రికార్డు చేయ‌నున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, హ‌రీశ్ రావు, సంతోష్ కుమార్ మిన‌హా కేసీఆర్ ఇంట్లోకి పార్టీ నేత‌లు, ఇత‌ర సిబ్బందికి అనుమ‌తి నిరాక‌రించారు.

కేసీఆర్ విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో నందిన‌గ‌ర్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎక్క‌డిక‌క్క‌డ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో స్వ‌ల్ప ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి.

కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్ బృందం ఇదే..

మాదాపూర్ డీసీపీ రీతిరాజ్‌, ఐపీఎస్ విజ‌య్ కుమార్‌, ఐపీఎస్ నారాయ‌ణ‌రెడ్డి, అడిష‌న‌ల్ ఎస్పీలు అర‌వింద్ కుమార్‌, కేఎస్ రావ్‌తో కూడిన బృందం కేసీఆర్‌ను విచారిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు ద‌ర్యాప్తులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంక‌ట‌గిరి విచార‌ణ‌కు దూరంగా ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement