త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్ర‌హాలు పెట్ట‌డంలో ఆంత‌ర్య‌మేంటి?: అల్లం నారాయ‌ణ‌

Allam Narayana | పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని మీడియా అకాడెమీ మాజీ చైర్మన్, టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ మండిపడ్డారు. ఆంధ్ర నేతల విగ్రహాలను హైదరాబాద్‌లో పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

S

Hyderabad | Published On Jun 1, 2026, 4.08 pm IST

Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్ర‌హాలు పెట్ట‌డంలో ఆంత‌ర్య‌మేంటి?: అల్లం నారాయ‌ణ‌
Advertisement
  • తెలంగాణ అస్తిత్వంపై కుట్ర‌లు జ‌రుగుతున్న‌య్‌
  • మ‌రో పోరుకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది
  • టీజేఎఫ్ ర‌జ‌తోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మంలో అల్లం నారాయ‌ణ పిలుపు

Allam Narayana | త్రినేత్ర‌.న్యూస్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని మీడియా అకాడెమీ మాజీ చైర్మన్, టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్లు గ‌డుస్తున్నాయ‌ని.. ఇప్పుడు కూడా ఆంధ్ర నేతల విగ్రహాలను హైదరాబాద్‌లో పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీజేఎఫ్ రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో అల్లం నారాయణ మాట్లాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సమైక్యాంధ్రవాదుల కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అని గుర్తు చేశారు. మరోసారి తన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

సీమాంధ్ర నేత‌ల చెప్పుచేతల్లో సీఎం రేవంత్‌..

అనంత‌రం టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీమాంధ్ర నేతల చెప్పు చేతల్లో పనిచేస్తున్నాడని విమ‌ర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అంత‌కుముందు టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులు ఘననివాళులు అర్పించారు.

Advertisement
Advertisement