Jeevan Reddy | జగిత్యాల గడ్డ.. జీవన్ రెడ్డి అడ్డా..
Jeevan Reddy | జగిత్యాల.. ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజల్లో చైతన్యం వస్తుంది.. రక్తం ఉరకలేస్తోంది.. ఎందుకంటే ఈ గడ్డ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది.. పోస్తూనే ఉంది. ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసింది.. ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువుగా పురుడు పోసుకున్న జగిత్యాల గడ్డ.. సీనియర్ నేత జీవన్ రెడ్డికి అడ్డాగా మారింది.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : జగిత్యాల.. ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజల్లో చైతన్యం వస్తుంది.. రక్తం ఉరకలేస్తోంది.. ఎందుకంటే ఈ గడ్డ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది.. పోస్తూనే ఉంది. ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసింది.. ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువుగా పురుడు పోసుకున్న జగిత్యాల గడ్డ.. సీనియర్ నేత జీవన్ రెడ్డికి అడ్డాగా మారింది. కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలకు పైగా క్రియాశీలక పాత్ర పోషించిన జీవన్ రెడ్డి జగిత్యాలను ఓ 30 ఏళ్లు పాలించారు. ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పేదల నాయకుడిగా పేరు సంపాదించుకున్న జీవన్ రెడ్డి.. ఓ సామాన్య ఎమ్మెల్యేగా తన పాత్ర పోషించారు. హంగుఅర్భాటాలకు తావు లేకుండా.. నిత్యం ప్రజల్లో మెలిగిన గొప్ప నేత జీవన్ రెడ్డి. కేవలం నియోజకవర్గ ప్రజల్లోనే కాదు.. కాంగ్రెస్ అధిష్టానంతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. రాజీవ్ గాంధీ సైతం జీవన్ రెడ్డి కృషిని, పోరాట పటిమను ప్రశంసించిన సందర్భం ఉంది. కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పరిస్థితి తారుమారైంది. సీనియర్లను పక్కన పెట్టి.. జీవన్ రెడ్డిని ఘోరంగా అవమానించారు. దాంతో తీవ్ర మనస్తాపంతో.. నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధానికి స్వస్తి పలికిన ఆయన.. మరో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. పదేండ్లు తెలంగాణను సుభిక్షంగా పాలించిన గులాబీ పార్టీలోకి జీవన్ రెడ్డి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను నెమరేసుకుందాం..
జగిత్యాలను ఏలిన వెలమలు, రెడ్లు..
జగిత్యాల నియోజకవర్గంలో ఏడుసార్లు రెడ్లు, ఏడుసార్లు వెలమ, మూడుసార్లు బీసీ వర్గం నేతలు, ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఒక ఎస్సీ నేత గెలుపొందారు. హైదరాబాద్ స్టేట్‌లో జగిత్యాల ద్విసభ్య నియోజకవర్గంగా ఉండే. నాడు జరిగిన 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బద్దం మల్లారెడ్డి, బుట్టి రాజారాం ఎన్నికై అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇలా..
సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 1981లో మల్యాల సమితి అధ్యక్షుడిగా ప్రారంభమైంది. 1983లో తొలిసారిగా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఎన్టీఆర్ కేబినెట్‌లో పని చేశారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. అనంతరం కాంగ్రెస్ ఐ పార్టీలో చేరి.. 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. 1994 ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోయినప్పటికి, అప్పుడు గెలిచిన ఎల్.రమణ, 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. దీంతో జగిత్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ ఉప ఎన్నికలో పోటీ చేసిన జీవన్ రెడ్డి మళ్లీ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 1999, 2004, 2014 ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక వైఎస్సార్ మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా సేవలందించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కేసీఆర్ రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు దిగిన సందర్భంలో జీవన్‌రెడ్డే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసి, అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ వెంటనే తిరిగి మంత్రి పదవి బాధ్యతలు చేట్టారు.
2018, 2023 ఎన్నికల్లో ఓటమి.. ఎమ్మెల్సీగా గెలుపు
జగిత్యాలలో ఆరుసార్లు విజయం సాధించిన జీవన్ రెడ్డి 2018 ఎన్నికలలో ఘోర ఓటమి చవి చూశారు. నాడు టీఆర్‌ఎస్ తరపున పోటీచేసిన డాక్టర్ ఎమ్ సంజయ్ కుమార్ భారీగా 61125 ఓట్ల ఆధిక్యతతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించడం మరో విశేషంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలలో సంజయ్ కుమార్‌కు 104247 ఓట్లు రాగా, జీవన్ రెడ్డికి కేవలం 43062ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బీజేపీ అభ్యర్ది ముదిగంటి రవీంద్ర రెడ్డికి కేవలం 4700 ఓట్లు మాత్రమే వచ్చాయి.
2014లో టీఆర్ఎస్‌కు ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత
2014లో కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత జీవన్ రెడ్డి కావడం విశేషం. ఆయన జగిత్యాల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్ది సంజయ్ కుమార్‌పై 7828 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
జగిత్యాలను ఏలింది వీరే..
2023 - డాక్టర్ సంజయ్ (బీఆర్ఎస్)
2018 - డాక్టర్ సంజయ్ (బీఆర్ఎస్)
2014 - టీ జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
2009 - ఎల్ రమణ (టీడీపీ)
2004 - టీ జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
1999 - టీ జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
1994 - ఎల్ రమణ (టీడీపీ)
1989 - టీ జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
1985 - జీ రాజేశం గౌడ్ (టీడీపీ)
1983 - టీ జీవన్ రెడ్డి (టీడీపీ)
1978 - దీవకొండ సురేందర్ రావు (కాంగ్రెస్ ఐ)
1972 - వెలిచాల జగపతి రావు (కాంగ్రెస్)
1967 - కేఎల్ఎన్ రావు (కాంగ్రెస్)
1962 - మక్నూరు ధర్మారావు (కాంగ్రెస్)
1957 - దీవకొండ హనుమంత్ రావు (కాంగ్రెస్)
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
1952 - బుట్టి రాజారాం (కాంగ్రెస్)
1952 - బద్దం మల్లారెడ్డి (కాంగ్రెస్)
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



