త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR – Jeevan Reddy | కారెక్కిన జీవ‌న్ రెడ్డి.. గులాబీ కండువా క‌ప్పిన కేసీఆర్

KCR - Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీతో నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా అనుబంధాన్ని తెగ‌దెంపులు చేసుకున్న మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి.. గులాబీ గూటికి చేరుకున్నారు. జ‌గిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో జీవ‌న్ రెడ్డి గులాబీ ద‌ళంలో చేరారు.

S

Telangana | Published On Apr 20, 2026, 7.21 pm IST

KCR – Jeevan Reddy | కారెక్కిన జీవ‌న్ రెడ్డి.. గులాబీ కండువా క‌ప్పిన కేసీఆర్
Advertisement

KCR - Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీతో నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా అనుబంధాన్ని తెగ‌దెంపులు చేసుకున్న మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి.. గులాబీ గూటికి చేరుకున్నారు. జ‌గిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో జీవ‌న్ రెడ్డి గులాబీ ద‌ళంలో చేరారు. ఈ సంద‌ర్భంగా జీవ‌న్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. జీవ‌న్ రెడ్డితో పాటు ఆయ‌న స‌హ‌చ‌రులు, మ‌ద్ద‌తుదారులు కూడా గులాబీ కండువా క‌ప్పుకున్నారు.

రేవంత్ రెడ్డి నియంతృత్వ పోక‌డ‌ల‌కు నిర‌స‌న‌గా కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవ‌న్ రెడ్డి.. ఈ నెల 10వ తేదీన ఎర్ర‌వ‌ల్లిలో కేసీఆర్‌తో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ఉన్న స్నేహాన్ని నెమ‌రేసుకున్నారు. అన్నా న‌న్ను దేవుడే పంపిండు.. మీతో క‌లిసి ప‌ని చేయ‌మ‌ని కేసీఆర్‌కు చెబుతూ జీవ‌న్ రెడ్డి భావోద్వేగానికి లోన‌య్యారు. కేసీఆర్ జీవ‌న్ రెడ్డిని ఆప్యాయంగా ప‌లుక‌రించారు.

జీవ‌న్ రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం ఇలా..

సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం 1981లో మ‌ల్యాల స‌మితి అధ్య‌క్షుడిగా ప్రారంభ‌మైంది. 1983లో తొలిసారిగా టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఎన్టీఆర్ కేబినెట్‌లో ప‌ని చేశారు. ఆ త‌ర్వాత నాదెండ్ల భాస్క‌ర‌రావు ప‌క్షాన చేరారు. అనంత‌రం కాంగ్రెస్ ఐ పార్టీలో చేరి.. 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. 1994 ఎన్నిక‌ల్లో జీవ‌న్ రెడ్డి ఓడిపోయినప్పటికి, అప్పుడు గెలిచిన ఎల్‌.రమణ, 1996లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నిక‌య్యారు. దీంతో జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో ఆ ఉప ఎన్నిక‌లో పోటీ చేసిన జీవ‌న్ రెడ్డి మ‌ళ్లీ గెలుపొందారు. ఆ త‌ర్వాత జ‌రిగిన 1999, 2004, 2014 ఎన్నిక‌ల్లోనూ జీవ‌న్ రెడ్డి హ్యాట్రిక్ విజ‌యం సాధించారు. ఇక వైఎస్సార్ మంత్రివ‌ర్గంలో ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రిగా సేవ‌లందించారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో కేసీఆర్‌ రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు దిగిన సందర్భంలో జీవన్‌రెడ్డే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసి, అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ వెంటనే తిరిగి మంత్రి పదవి బాధ్యతలు చేట్టారు.

2018, 2023 ఎన్నిక‌ల్లో ఓట‌మి.. ఎమ్మెల్సీగా గెలుపు

జగిత్యాలలో ఆరుసార్లు విజయం సాధించిన జీవన్‌ రెడ్డి 2018 ఎన్నికలలో ఘోర ఓట‌మి చవి చూశారు. నాడు టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసిన డాక్టర్‌ ఎమ్ సంజయ్‌ కుమార్‌ భారీగా 61125 ఓట్ల ఆధిక్యతతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి జీవన్‌ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించడం మరో విశేషంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలలో సంజయ్‌ కుమార్‌కు 104247 ఓట్లు రాగా, జీవన్‌ రెడ్డికి కేవలం 43062ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బీజేపీ అభ్యర్ది ముదిగంటి రవీంద్ర రెడ్డికి కేవలం 4700 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Advertisement
Advertisement