Sanjay Jaju | రక్షా ఎక్స్‌పోపై షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించండి
Sanjay Jaju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా భారీ స్థాయిలో నిర్వహించే రక్షా ఎక్స్‌పోపై షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించాలని, ప్రముఖ ప్రాంతాల్లో స్టాండీలను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
- స్టాండీలను ఏర్పాటు చేసి ఎక్కువ ప్రచారం చేయండి
- రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి ఈ ఎక్స్‌పో ఎంతో అవసరం
- అధికారుకలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశం
త్రినేత్ర న్యూస్: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా భారీ స్థాయిలో నిర్వహించే రక్షా ఎక్స్‌పోపై షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించాలని, ప్రముఖ ప్రాంతాల్లో స్టాండీలను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ ఎక్స్ పో నిర్వహిస్తామని చెప్పారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి ఎక్స్‌పో దోహదపడుతుందన్నారు. డిసెంబర్ 9న ఎయిర్ షో ఉంటుందని పేర్కొన్నారు. ఎక్స్‌పో నిర్వహణ ఏర్పాట్లపై డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోకు సంబంధించిన ఏర్పాట్లు, పాల్గొనే సంస్థలు, ప్రచార కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
రక్షణ, వైమానిక రంగాలకు సంబంధించిన సుమారు 30 శాతం పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని సీఎస్ తెలిపారు. తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు రక్షా ఎక్స్‌పో కీలక వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖ రక్షణ, ఆయుధ తయారీ సంస్థలు, డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు సీఎస్ తెలిపారు.
24, 29 తేదీల్లో రోడ్‌షో..
ఎక్స్‌పోకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అక్టోబర్ 24న హైదరాబాద్‌లో, అక్టోబర్ 29న న్యూఢిల్లీలో రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌ఫీల్డ్ స్ట్రిప్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఆ రంగాలకు ప్రత్యేక వేదిక
ఫిక్కీ, అసోచామ్, ఎస్‌ఐడీఎం, ఎంఎస్‌ఎంఈలతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఎక్స్‌పోలో భాగస్వామ్యం చేయాలని సీఎస్ సూచించారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్ తదితర ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు మార్కెటింగ్, బయ్యర్–సెల్లర్ సమావేశాలు, బిజినెస్ ఇంటరాక్షన్స్, ఎంఓయూలు, స్టార్టప్‌లకు అవకాశాలు, సెమినార్లు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసు, పారామిలటరీ దళాల ఆధునికీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల డీజీపీలను కూడా రక్షా ఎక్స్‌పోకు ఆహ్వానించాలని సీఎస్ సూచించారు.
బ
ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, పంచాయతీరాజ్, సెర్ప్ కమిషనర్ దివ్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





