Traffic restrictions | హైదరాబాద్‌లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions | ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా, దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 12వ తేదీ నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రకటించారు.
Traffic restrictions | త్రినేత్ర.న్యూస్ : ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా, దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 12వ తేదీ నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
వీవీ విగ్రహం వైపు నుండి:
రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుండి:
రాజ్ దూత్ లేన్ మీదుగా బడా గణేష్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ వైపు నుండి:
మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ థియేటర్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
నెక్లెస్ రోటరీ వైపు నుండి:
మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
నిరంకారి వైపు నుండి:
ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
అధిక రద్దీ ఉండే ప్రాంతాలు:
భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్ మరియు మాసాబ్ ట్యాంక్ ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడవచ్చు. కావున ప్రయాణికులు ఈ మార్గాలను వీలైనంత వరకు సహకరించాలని పోలీసులు కోరారు.
వాహనాల పార్కింగ్ స్థలాలు:
నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుండి వచ్చే భక్తులు:
1. రేస్ కోర్స్ రోడ్
2. ఎన్టీఆర్ ఘాట్
3. ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం
4. ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం
ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుండి వచ్చే భక్తులు:
విశ్వేశ్వరయ్య భవన్
భక్తుల రద్దీకి అనుగుణంగా పై ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రయాణ వేళల్లో అత్యవసర సహాయం కొరకు ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించగలరు అని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
- ●Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్‌చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు
- ●Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
- ●Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
- ●Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్

Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్‌చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు

Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి

Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్






