Saraswati Antya Pushkaralu | సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వంసిద్ధం.. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు: మంత్రి కొండా సురేఖ
Saraswati Antya Pushkaralu | సరస్వతి అంత్య పుష్కరాలకు (Saraswati Antya Pushkaralu) సర్వం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు అంత్యపుష్కరాలు జరుగనున్నాయి.
Saraswati Antya Pushkaralu | త్రినేత్ర.న్యూస్: సరస్వతి అంత్య పుష్కరాలకు (Saraswati Antya Pushkaralu) సర్వం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు అంత్యపుష్కరాలు జరుగనున్నాయి. గురువారం ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్దురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం పుష్కరాలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి రోజు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుష్కర స్నానం ఆచరించనున్నారు. గతేడాది సరస్వతి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే.
ఏర్పాట్లు ఇలా..
అంత్య పుష్కరాల సందర్భంగా జ్ఞానసరస్వతి పుష్కర ఘాట్, వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు.. సౌండ్స్ అండ్ లైటింగ్, ప్రత్యేక డెకరేషన్ చేశారు. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుండి 3,360 బస్సు సర్వీసులు ఆర్టీసీ నడుపుతున్నది. 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక హోమాలు..
అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామిజీలు, పీఠాదిపతులు రానున్నారు.. ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. మొదటిరోజు 21న మహా గణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం, 23న హయగ్రీవ హోమం, 24న నవగ్రహ హోమం, 25న మహా మృత్యుజయ హోమం, 26న దుర్గా సూక్త హోమం, 27న మహా సుదర్శన హోమం, 28న వేద దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతి హోమం, 30న ధన్వంతరి హోమం, మే 31న మహారుద్ర హోమం, జూన్ 1వ తేదీన లఘు చండీ మహా పూర్ణాహుతి ఉంటుంది.

భక్తులకు ఇబ్బంది కలగకుండా..
సరస్వతి అంత్యపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి కొండ సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం బయట మాట్లాడుతూ.. ఈ అంత్య పుష్కరాలకు రూ. 200 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. రోజుకు ఒక స్వామీజీ స్నానంతో ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం గోదావరి హారతి ఇస్తారని చెప్పారు.
సంబంధిత వార్తలు

Saraswati Antya Pushkaralu | సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం.. భారీగా తరలి వచ్చిన భక్తులు
మే 21, 2026

Uttam Kumar Reddy | ఎన్నికల కోసమే కేంద్రం చమురు ధరలు పెంచలే.. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసింది: ఉత్తమ్
మే 15, 2026

Konda Surekha | తప్పుచేయనంత వరకు ఎవరికీ భయపడొద్దు: మంత్రి కొండా సురేఖ
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



