త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sankranthi Traffic Diversion | సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ.. హైదరాబాద్ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు..

Sankranthi Traffic Diversion | హైదరాబాద్: సంక్రాంతి పండుగ ముగిసిన‌ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు రానున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ హైవే- 65 (హైద‌రాబాద్- విజయవాడ) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు.

S

Telangana | Published On Jan 16, 2026, 8.02 am IST

Sankranthi Traffic Diversion | సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ.. హైదరాబాద్ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు..
Advertisement

Sankranthi Traffic Diversion | హైదరాబాద్: సంక్రాంతి పండుగ ముగిసిన‌ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు రానున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ హైవే- 65 (హైద‌రాబాద్- విజయవాడ) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డేందుకు అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. అందువ‌ల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ప‌లు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దారి మళ్లింపు వివరాలు :

1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంటుంది.

2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది.

3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు : నల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్.65)మీదుగా హైదరాబాద్ కు వెళ్ల‌వ‌చ్చు.

4) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు: కోదాడ-హుజూర్ న‌గర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాలి.

5) ఎన్. హెచ్.65 (విజయవాడ -హైదరాబాద్ ) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు కొన‌సాగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి గుండా హైద‌రాబాద్ కు వాహ‌నాల‌ను దారి మళ్లించడం జరుగుతుంది.

ఆయా మార్గాలలో వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద‌రాబాద్ పై (ఎన్.హెచ్.65 ) ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని తెలిపారు. సంక్రాంతి పండుగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు హైద‌రాబాద్‌కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమ‌ని అన్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామ‌ని, ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఓర్పుతో ప్రయాణించాలని అన్నారు. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అని తెలిపారు. పండుగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement