త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఎర్ర‌వెల్లిలో ఘ‌నంగా సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకున్న కేసీఆర్ కుటుంబం

KCR | మకర సంక్రాంతి (Sankranthi) పర్వదినం పురస్కరించుకొని, తెలంగాణ (Telangana) తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఎర్ర‌వెల్లి నివాసంలో వేడుకలు ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

A

Telangana | Published On Jan 15, 2026, 7.29 pm IST

KCR | ఎర్ర‌వెల్లిలో ఘ‌నంగా సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకున్న కేసీఆర్ కుటుంబం
Advertisement

KCR | మకర సంక్రాంతి (Sankranthi) పర్వదినం పురస్కరించుకొని, తెలంగాణ (Telangana) తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఎర్ర‌వెల్లి నివాసంలో వేడుకలు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. రంగు రంగుల ముగ్గుల రంగవల్లులు, సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలిచే పలు రకాల అలంకరణలతో, ఎర్రవెల్లి నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. గురువారం తన స‌తీమ‌ణి శైలిమ‌, పిల్ల‌లు హిమాన్షు, అలేఖ్య‌ల‌తో క‌లిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్ర‌వెల్లి చేరుకున్నారు. కుటుంబమంతా కల్వకుంట్ల శోభమ్మ చంద్ర శేఖర్ రావు ఆశీస్సులు తీసుకున్నారు. కుమారుడు, కోడలు, మనుమడు, మనుమరాలిని మనస్ఫూర్తిగా దీవించిన కేసీఆర్ దంపతులు, వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement