Ntr Dragon | ఎన్టీఆర్ డ్రాగన్‌లో బాలీవుడ్ సీనియర్ హీరో – 45 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ
ఎన్టీఆర్ డ్రాగన్ నుంచి మరో సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అనిల్ కపూర్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
Entertainment | Published On Jan 16, 2026, 11.29 am IST
Ntr Dragon | బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నలభై ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్‌లో ఈ బాలీవుడ్ యాక్టర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్ నటించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటివరకు అఫీషియల్‌గా వెల్లడించలేదు. తాజాగా 2026 ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాల జాబితాను ఐఎమ్‌డీబీ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ డ్రాగన్ చోటు దక్కించుకుంది. ఐఎమ్‌డీబీ లిస్ట్‌లోని డ్రాగన్ మూవీ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అనిల్ కపూర్. ఈ పోస్టర్ తో తాను ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒకటి వచ్చేసింది. మరో రెండు లైన్‌లో ఉన్నాయి అంటూ ఈ పోస్టర్‌కు అనిల్ కపూర్ క్యాప్షన్ ఇచ్చారు. అనిల్ కపూర్ పోస్ట్‌ను ఎన్టీఆర్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
వార్ 2 తర్వాత...
ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో అనిల్ కపూర్ నటించారు. రెండోసారి వీరిద్దరు కలిసి సినిమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
అనిల్ కపూర్ తెలుగులో సినిమా చేయడం ఇదే మొదటిసారి కాదు. హీరోగా అనిల్ కపూర్ ప్రయాణం తెలుగు సినిమాతోనే మొదలైంది. దిగ్గజ దర్శకుడు బాపు డైరెక్షన్‌లో వచ్చిన తెలుగు మూవీ వంశవృక్షంలో అనిల్ కపూర్ కథానాయకుడిగా కనిపించాడు. బాలీవుడ్‌లో టాప్ హీరోగా మారడంతో ఆ తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. దాదాపు నలభై ఐదైళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ కపూర్.
రుక్మిణి వసంత్ హీరోయిన్...
డ్రాగన్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో మలయాళ నటులు టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి మొదలుకాబోతుంది. డ్రాగన్ మూవీ ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Ntr | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్ – డ్రాగన్ టైటిల్ ఛేంజ్?
ఏప్రిల్ 21, 2026

Alia Bhatt | ఆర్ఆర్ఆర్ తర్వాత మరో తెలుగు సినిమాలో ఆలియా – ఎన్టీఆర్ డ్రాగన్‌పై క్రేజీ రూమర్ వైరల్
ఏప్రిల్ 14, 2026

Bhagyashri Borse | లవ్లెటర్కు భాగ్యశ్రీ బోర్సే క్రేజీ రియాక్షన్ – నెట్టింట వైరల్ అవుతోన్న పోస్ట్
ఏప్రిల్ 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



