Richest People | హైదరాబాద్‌లో అత్యంత ధనవంతులు.. మేఘా అధినేత ఏ స్థానంలో ఉన్నారంటే?
Richest People | దేశంలో ఫార్మా క్యాపిటల్‌గా పేరొందిన హైదరాబాద్ (Hyderabad).. సాఫ్ట్‌వేర్, ఇన్‌ఫ్రా, రియల్ఎస్టేట్ ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నది. దీంతో నగరంలో సంపన్నులు (Richest People) కూడా రోజురోజుకు రెట్టింపవుతున్నారు.
త్రినేత్ర.న్యూస్: దేశంలో ఫార్మా క్యాపిటల్‌గా పేరొందిన హైదరాబాద్ (Hyderabad).. సాఫ్ట్‌వేర్, ఇన్‌ఫ్రా, రియల్ఎస్టేట్ ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నది. దీంతో నగరంలో సంపన్నులు (Richest People) కూడా రోజురోజుకు రెట్టింపవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుల జాబితా తాజాగా విడుదలైంది.
ఇందులో ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం టాప్ ప్లేస్‌లో ఉన్నది. సుమారు రూ.91,100 కోట్ల నెట్ వర్త్‌తో హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నులుగా నిలిచారు. ఇక భారీ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)కు చెందిన పిచ్చి రెడ్డి రూ.42,650 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
- మూడో స్థానంలో .. రూ.41,810 కోట్ల సంపదతో ఎంఈఐఎల్ సహ వ్యవస్థాపకుడు పీవీ. కృష్ణ రెడ్డి
- ఫోర్త్ ప్లేస్‌లో.. రూ.39,030 కోట్లతో హెటెరో ల్యాబ్స్‌కు చెందిన బి. పార్థసారధి రెడ్డి
- ఐదో స్థానంలో.. రూ.39,000 కోట్లతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన కే. సతీష్ రెడ్డి కుటుంబం
6వ స్థానంలో.. రూ.35,000 కోట్లతో ఆరోబిందో ఫార్మాకు చెందిన పీవీ. రామ్‌ప్రసాద్ రెడ్డి - ఏడో స్థానంలో.. రూ.29 వేల కోట్లతో ప్రీమియర్ ఎనర్జీస్‌కు చెందిన సురేందర్ సలూజా కుటుంబం
- 8వ స్థానంలో.. రూ.25 వేల కోట్లతో మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఉన్నారు.
- తొమ్మిదో ప్లేస్‌లో.. రూ.15,900 కోట్లతో బయాలజికల్-ఈ సంస్థకు చెందిన మహిమ దాట్ల
- 10వ స్థానంలో.. ఎమర్జింగ్ వెల్త్ క్రియేటర్స్ సంస్థ
కాగా, హైదరాబాద్‌లోని ధనికుల జాబితా చూస్తే.. ఎక్కువగా ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, సోలార్ ఎనర్జీ రంగాలకు చెందినవారే ఉన్నారు. అదేవిధంగా నగరంలో రూ.1,000 కోట్లు పైగా ఆస్తులు కలిగిన వారు 100 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





