Temple Robbery | గూగుల్‌లో వెతికి మరీ.. వెంకటేశ్వర ఆలయంలో చోరీ
Temple Robbery | మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నారు. గూగుల్‌లో (Google) వెతికి మరీ దొంగతనాలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో (Temple Robbery) జరిగింది.
త్రినేత్ర.న్యూస్: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నారు. గూగుల్‌లో (Google) వెతికి మరీ దొంగతనాలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో (Temple Robbery) జరిగింది.
ఆలయానికి సంబంధించిన వివరాలను గూగుల్ ద్వారా తెలుసుకున్న దొంగలు.. పక్కా స్కెచ్ వేసి పని పూర్తి చేశారు. ఈ నెల 6న అర్ధరాత్రి సమయంలో కేపీహెచ్‌బీ (KPHB Colony) సర్దార్ పటేల్ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి చొరబడిన దొంగల ముఠా.. గర్భగుడిలోని మూలవిరాట్‌కు అలంకరించిన సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి నగలు, మూడు వెండి విగ్రహాలతో పాటు ఒక పంచలోహ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు.
మరుసటి రోజు ఉదయం దేవాలయానికి వచ్చిన పూజారులు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన వస్తువుల విలువ రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీలను జల్లడపట్టారు. ఘటనా స్థలం నుంచి నిందితులు వెళ్లిన మార్గాల్లో ఉన్న సుమారు 200కు పైగా సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను కండ్లకోయకు చెందిన నీలయ్య, ఎం.మల్లికార్జున్, మోహిత్ కుమార్ సహా ఏడుగురిని గుర్తించారు. వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నాయకుడు నీలయ్య, మోహిత్ కుమార్ పరారీలో ఉన్నారని తెలిపారు.
మోహిత్ కుమార్ గూగుల్‌లో ఆలయాన్ని వెతకగా.. నీలయ్య, మల్లికార్జున్ చోరీకి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి, రాగి ఆభరణాలతో పాటు ఒక బైక్, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో కరిగించి, సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారన్నారు.
ప్రధాన నిందితుడు నీలయ్య గతంలో 15కు పైగా దోపిడీ కేసుల్లో పట్టుబడ్డారని చెప్పారు. గతేడాది నవంబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడని వెల్లడించారు. ఆ తర్వాత అమీర్‌పూర్‌లో ఒక బైక్ దొంగతనం కేసులో కూడా ఉన్నాడన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో నిందితులను ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పట్టుకున్నామని కూకట్‌పల్లి సీఐ తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






