లోడ్ అవుతోంది...

CWC | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గోదావరి, కృష్ణా నది నీటి వాటాలపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలను పరిష్కారించేందుకు జనవరి 2వ తేదీన కేంద్రం 15 మంది అధికారులతో ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర జల్ శక్తి ఏర్పాటు చేసిన కమిటీకి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు.
మొత్తానికి ఈ ప్రత్యేక కమిటీ భేటీకి ముందడుగు వేసింది. జనవరి 30వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని సేవా భవన్‌లో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో భేటీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ రాకేశ్ కుమార్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జీఆర్ఎంబీ(గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు), కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) కమిటీకి నివేదించాలి.
కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించే ఈ కమిటీలో తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యానాథ్‌దాస్‌తోపాటు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యే క కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఏపీ నుంచి ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ న ర్సింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలను మెంబర్లుగా నియమించింది.
అలాగే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్ బిశ్వా స్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) సీఈ దాస్, సీడబ్ల్యూసీ ప్రా జెక్టు అప్రయిజల్ ఆర్గనైజేషన్(పీఏవో) సీఈ పైథాంకర్‌ను కేంద్రం నుంచి సభ్యులుగా కమిటీలో చోటు కల్పించడంతో పాటు సాంకేతిక నిపుణులను సైతం నియమించుకొనే వెసులుబాటు కల్పించింది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam