త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | రూ. కోటి ప‌రిహారం అందే వ‌ర‌కు సిగాచీ కంపెనీని వ‌దిలిపెట్టం : మంత్రి వివేక్

Minister Vivek | సిగాచీ ప‌రిశ్ర‌మ‌లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాల‌కు రూ.1 కోటి చొప్పున పరిహారం అందే వరకు సిగాచి కంపెనీపై ప్రభుత్వ ఒత్తిడి కొనసాగుతుందే తప్ప తగ్గదని రాష్ట్ర కార్మిక‌, ఫ్యాక్ట‌రీ, గ‌నుల శాఖ మంత్రి వివేక్ వెంక‌టస్వామి స్పష్టం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్య‌లు పూర్తిగా రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకున్న‌వ‌ని మంత్రి వివేక్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Jun 30, 2026, 5.34 pm IST

Minister Vivek | రూ. కోటి ప‌రిహారం అందే వ‌ర‌కు సిగాచీ కంపెనీని వ‌దిలిపెట్టం : మంత్రి వివేక్
Advertisement

Minister Vivek | త్రినేత్ర‌.న్యూస్ : సిగాచీ ప‌రిశ్ర‌మ‌లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాల‌కు రూ.1 కోటి చొప్పున పరిహారం అందే వరకు సిగాచి కంపెనీపై ప్రభుత్వ ఒత్తిడి కొనసాగుతుందే తప్ప తగ్గదని రాష్ట్ర కార్మిక‌, ఫ్యాక్ట‌రీ, గ‌నుల శాఖ మంత్రి వివేక్ వెంక‌టస్వామి స్పష్టం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్య‌లు పూర్తిగా రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకున్న‌వ‌ని మంత్రి వివేక్ నిప్పులు చెరిగారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వివేక్ మాట్లాడారు. సిగాచి ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైన ఘటన. ఈ ఘటన జరిగిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత బాధ్యతతో వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహాతో కలిసి కార్మిక శాఖ మంత్రిగా తాను వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచిందన్నారు.

కార్మికుల కుటుంబాలకు దాదాపు రూ.50 లక్షల చొప్పున పరిహారం

సిగాచి యాజమాన్యాన్ని ప్రభుత్వం పలుమార్లు పిలిపించి బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగానే ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు దాదాపు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకున్నామని, బాధ్యులపై పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, కంపెనీ సీఎండీని అరెస్ట్ చేశాం. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఫ్యాక్టరీల కూడా తనిఖీలు నిర్వహించి యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు చేపట్టారని వివరించారు.

తప్పుదోవ పట్టించేందుకు హ‌రీశ్‌రావు ప్రయత్నం

బాధితులకు పూర్తి న్యాయం జరగాలనే స్పష్టమైన వైఖరిని హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు సిగాచి కంపెనీపై ప్రభుత్వ ఒత్తిడి కొనసాగుతుందే తప్ప తగ్గే ప్ర‌స‌క్తే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హ‌రీశ్‌రావు ప్రయత్నం చేస్తున్నార‌ని వివేక్ మండిప‌డ్డారు.

కొండ‌గ‌ట్టు ప్ర‌మాద‌స్థ‌లికి కేసీఆర్ ఎందుకు వెళ్ల‌లేదు..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా భక్తులు మరణించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఘటనాస్థలికి వెళ్లలేదు..? బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు..? తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు తారుమారు జరిగి, 20 మంది విద్యార్థులు మృతి చెందినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది

సిగాచి ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టప్రకారం తీసుకోవాల్సిన ప్రతి చర్యను తీసుకుందని, బాధిత కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. "సిగాచి కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు కంపెనీని వదిలిపెట్టం" అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement