త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sangameshwara Temple | సంగ‌మేశ్వ‌ర క్షేత్రం.. ఏడాదిలో 4 నెలలు మాత్రమే శిఖ‌ర ద‌ర్శ‌నం

Sangameshwara Temple | ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే అద్భుతమైన ఏకైక ప్రదేశం సంఘమేశ్వర క్షేత్రం (Sangameshwara Temple). ఏడాదిలో నాలుగు నెల‌లు మాత్ర‌మే భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఈ ఆల‌య ప్ర‌త్యేక‌త‌. ఆ స‌మ‌యం ఇప్పుడు వ‌చ్చింది. సంవ‌త్స‌రంలో 8 నెలలపాటు నీటిలో ఉండే ఈ ప్రాంతం.. ప్ర‌స్తుతం శ్రీశైలం వెనుక జ‌లాల త‌గ్గుతుండ‌టంతో సంఘ‌మేశ్వ‌ర క్షేత్ర శిఖ‌రాలు ఇప్పుడు కృష్ణ‌మ్మ ఒడి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

G

Telangana | Published On Mar 3, 2026, 1.20 pm IST

Sangameshwara Temple | సంగ‌మేశ్వ‌ర క్షేత్రం.. ఏడాదిలో 4 నెలలు మాత్రమే శిఖ‌ర ద‌ర్శ‌నం
Advertisement

Sangameshwara Temple | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే అద్భుతమైన ఏకైక ప్రదేశం సంఘమేశ్వర క్షేత్రం (Sangameshwara Temple). ఏడాదిలో నాలుగు నెల‌లు మాత్ర‌మే భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఈ ఆల‌య ప్ర‌త్యేక‌త‌. ఆ స‌మ‌యం ఇప్పుడు వ‌చ్చింది. సంవ‌త్స‌రంలో 8 నెలలపాటు నీటిలో ఉండే ఈ ప్రాంతం.. ప్ర‌స్తుతం శ్రీశైలం వెనుక జ‌లాల త‌గ్గుతుండ‌టంతో సంఘ‌మేశ్వ‌ర క్షేత్ర శిఖ‌రాలు ఇప్పుడు కృష్ణ‌మ్మ ఒడి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో సోమ‌శిల‌కు స‌మీపంలో ఉన్న ఈ క్షేత్రానికి మ‌ర ప‌డ‌వ‌ల్లో వెళ్లిన పురోహితులు తెల్క‌ప‌ల్లి ర‌ఘురామ‌శ‌ర్మ‌, భ‌క్తులు మ‌ర ప‌డ‌వ‌ల్లో వెళ్లి శిఖ‌రాల‌కు అభిషేకాలు, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

స్థలపురాణం

వేల ఏండ్ల చ‌రిత్ర‌, ఎంద‌రో రుషులు, మునుల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన ఈ ప్రాంతానికి ఘ‌న కీర్తి ఉన్న‌ది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతున్న‌ది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ఠ సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

 

Advertisement
Advertisement