త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Beeram Harshavardhan Reddy | కొల్లాపూర్ భూ ఆక్రమణలపై జ్యుడీషియ‌ల్ విచార‌ణ జ‌రిపించండి.. మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్

G

Telangana | Published On May 3, 2026, 12.34 pm IST

Beeram Harshavardhan Reddy | కొల్లాపూర్ భూ ఆక్రమణలపై జ్యుడీషియ‌ల్ విచార‌ణ జ‌రిపించండి.. మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్
Advertisement

Beeram Harshavardhan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కొల్లాపూర్‌లో (Kollapur) జ‌రిగిన భూ ఆక్ర‌మ‌ణ‌ల‌పై జ్యుడీషియల్ విచార‌ణ (Judicial Enquiry) చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) డిమాండ్ చేశారు. త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. కొల్లాపూర్ సంస్థానాదీశుల‌కు చెందిన 16 వందల ఎకరాల భూమిని కాపాడినట్లు చెప్పార‌ని, అయితే ఆయ‌న ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూమికి నాటి ప్రభుత్వం పాస్ బుక్‌లు జారీ చేసింద‌న్నారు. ప్ర‌స్తుతం ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా ఆ పాసు బుక్కులను తొలగించి భూమినీ రక్షించామ‌న్నారు. హైద‌రాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ నేత అభిలాశ్ రంగినేనితో క‌లిసి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూమి కోసం తాను ఎవరితోనూ కుమ్మకు కాలేదన్నారు.

జూపల్లి కృష్ణారావు మ‌రోసారి అబద్ధపు మాటలు మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తాన‌ని హెచ్చ‌రించారు. కొల్లాపూర్ వద్ద ఎల్లాపురంలో 44 ఎకరాల సీలింగ్ అటవీ భూములను రికార్డులు మార్చి విక్రయించార‌ని ఆరోపించారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో చెట్లను కొట్టేసి భూములను అమ్ముకున్నార‌ని చెప్పారు. స్థానికులు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారని వెల్ల‌డించారు. జూపల్లి కృష్ణారావు కుమ్మక్కై ఇలాంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌కు ఓటు వేయ‌ని వారిని జూపల్లి బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు.

జిల్లాలో 30 లక్షల మంది రైతులకు గన్ని బ్యాగులు కావాల‌ని చెప్పారు. దాని నుంచి తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమ‌ర్శించారు. మక్కలు, వరి, ఇతర పంటలు కొనకుండా నాటకలాడుతున్నారని మండిప‌డ్డారు. దేవాలయ భూములను కూడా ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జూపల్లి కృష్ణారావు అనుచరులు భూ ఆక్రమణల్లో ఉన్నారని చెప్పారు. ఆయ‌న‌కు న్యాయ వ్యవస్థపై గౌరవం లేద‌ని, రెండున్నర సంవత్సరాలలో ఆయ‌న చేసిన అభివృద్ధి శూన్యమ‌ని విమ‌ర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేద‌ని, కొల్లాపూర్ భూ ఆక్రమణలపై జ్యుడీషియల్ విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement