త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KRMB | కేఆర్ఎంబీ కీల‌క నిర్ణ‌యం.. తెలంగాణ‌కు 16, ఏపీకి 10 టీఎంసీల నీరు విడుద‌ల‌..!

KRMB | తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల తాగునీటి అవ‌స‌రాల మేర‌కు నీటిని విడుద‌ల చేయాల‌ని కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుద‌ల‌కు కేఆర్ఎంబీ అంగీకారం తెలిపింది.

S

Telangana | Published On May 12, 2026, 6.27 pm IST

KRMB | కేఆర్ఎంబీ కీల‌క నిర్ణ‌యం.. తెలంగాణ‌కు 16, ఏపీకి 10 టీఎంసీల నీరు విడుద‌ల‌..!
Advertisement

KRMB | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల తాగునీటి అవ‌స‌రాల మేర‌కు నీటిని విడుద‌ల చేయాల‌ని కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుద‌ల‌కు కేఆర్ఎంబీ అంగీకారం తెలిపింది.

నాగార్జున సాగ‌ర్ నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణ‌కు 16 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం నుంచి తెలంగాణ‌కు 5 టీఎంసీల నీటి విడుద‌ల‌కు కేఆర్ఎంబీ అనుమ‌తి ఇచ్చింది. ఈ ఒప్పందం మంగ‌ళ‌వారం నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు అమ‌లు కానుంది.

ఏపీ ఇప్పటికే ఎక్కువ నీరు వాడుకుందని సమావేశంలో తెలంగాణ ఇంజినీర్లు తెలిపారు. సాగర్‌లో ఏపీకి 10 టీఎంసీలు పోగా మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని తెలిపింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 14న మరోసారి సమావేశం

త్రిసభ్య కమిటీ సమావేశం సాఫీగా సాగిందని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి తెలిపారు. ఆగస్టు 15 వరకు ఏపీ నీటి అవసరాల కోసం 10 టీఎంసీలు, తెలంగాణకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 16 టీఎంసీలు వినియోగించుకోవచ్చని ఏపీ ఈఎన్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన అంశాలపై చర్చిస్తామని పేర్కొంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధ వేదికగా కేఆర్​ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్‌ చీఫ్ రమేశ్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నర్సింహమూర్తి సమావేశమయ్యారు.

Advertisement
Advertisement