Harish Rao | ఆ మహోన్నత పోరాటానికి 14 ఏండ్లు.. తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం సాగరహారం: హరీశ్ రావు
Harish Rao | తెలంగాణ ఉద్యమంలో సాగరహారం (Sagara Haram) ఒక చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆ మహోన్నత పోరాటానికి బుధవారంతో (సెప్టెంబర్ 30న) 14 ఏండ్లు పూర్తయ్యాయని చెప్పారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: తెలంగాణ ఉద్యమంలో సాగరహారం (Sagara Haram) ఒక చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆ మహోన్నత పోరాటానికి బుధవారంతో (సెప్టెంబర్ 30న) 14 ఏండ్లు పూర్తయ్యాయని చెప్పారు. లక్షలాది తెలంగాణ బిడ్డలు ఒక్కటై, ఇనుప కంచెలు, బారికేడ్లను లెక్కచేయకుండా చీమల దండులా తరలివచ్చి నెక్లెస్ రోడ్డును జనసంద్రంగా మార్చిన రోజని తెలిపారు. లక్షల గొంతుకలు ఏకమై `జై తెలంగాణ` నినాదాలతో మార్మోగిస్తూ, తెలంగాణ ఆకాంక్షను యావత్ దేశానికి చాటిచెప్పిన రోజని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ఎక్స్ వేదిక పోస్టు చేశారు.

నేల ఈనిందా అనేలా..
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటిచెప్పేలా 2012 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సాగరహారం నిర్వహించారు. తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు నేల ఈనిందా అనేలా పది జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. నెక్లెస్ రోడ్డులో కవాతు నిర్వహించారు. నెక్లెస్ రోడ్డు, పీవీ ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ నిండా నిండారు. నేల ఈనిందా అనేలా ఇసుకేస్తే రాలనంత మందితో నెక్లెస్ రోడ్డు (Necklace Road) జనసంద్రమైంది. తెలంగాణవాదులతో నిండిపోయిన హైదరాబాద్ నగరం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది.

ఇక ఓయూ విద్యార్థులు తలపెట్టిన బైక్ ర్యాలీ రణరంగమైంది. నెక్లెస్ రోడ్డుకు బయల్దేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేట్ వద్దే అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఇలా తీవ్ర నిర్భందాల నడుమ.. అడుగడుగా అడ్డంకులు, పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలను లెక్క చేయకుండా.. ముళ్లకంచెలు, బారీకేడ్లను తొలగించి తెలంగాణ వాదులు నెక్లెస్ రోడ్డుకు చేరుకుని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటిపచెప్పారు.
సంబంధిత వార్తలు

Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు
సెప్టెంబర్ 30, 2026

MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సెప్టెంబర్ 30, 2026

Balka Suman | సింగరేణిని అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●HMD Vibe2 Pro 5G | హెచ్ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..
- ●SIR | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉపసంహరణ
- ●Balka Suman | సింగరేణిని అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం
- ●Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
- ●CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..

MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

HMD Vibe2 Pro 5G | హెచ్ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..

SIR | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉపసంహరణ

Balka Suman | సింగరేణిని అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం



